అమెరికా షోబిజ్ క్యాపిటల్, సంపన్నుల నగరంగా ఉన్న లాస్ ఏంజెలెస్ బూడిదగా మారుతోంది. సాధారణంగా కార్చిచ్చు అడవుల్లో ఏర్పడుతుంది. అడవుల్ని దహించి వేస్తుంది. కానీ లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు ఆ నగరాన్ని దహించి వేస్తోంది. ఇళ్లనూ.. బూడిదగా మార్చేస్తోంది. బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్ ఇప్పుడు కనిపించడంలేదు. ఇప్పటికే30వేల ఎకరాలు కాలిబూడిదయింది. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోకి రావడం లేదు. లక్షల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
లాస్ ఏంజెలెస్ జనాలు తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. హాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే లాస్ ఏంజెలెస్ లోని రియల్ ఎస్టేట్ నేలమట్టమయ్యింది. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. అడవులు తగలబడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్చిచ్చును ఆపడానికి అగ్ర రాజ్యం వద్ద కూడా ఎలాంటి బలం లేకుండాపోయింది. దీంతో మంటలకు అంతా వదిలేసి పారిపోవడం తప్ప ఏమీ సాధ్యం కావడం లేదు.
లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వర్షాలు పడలేదు. అటవీ ప్రాంతంలో చెట్లు అన్నీ ఎండిపోయి ఉండటం.. బలమైన గాలుల వల్ల మంటలు అదుపు అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. బూడిద చేసినంత చేసి ఆ మంటలే ఆగిపోతే అప్పుడు మిగిలిందే మహా ప్రసాదం అనుకునే పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతాల్లోనే లగ్జరీ ఇళ్లు కట్టుకోవడం.. మాత్రమే కాదు నగరం మొత్తం.. మంటలు వ్యాపారిస్తున్నాయి. ఈ కారణంగా ఆస్కార్ వేడుక కూడా అనుమానంలో పడుతోంది.