పవన్ కళ్యాణ్ నిన్న మంగళ గిరిలో ఇచ్చిన స్పీచ్ కి మీడియా కవరేజ్ లభించడంతో ఆ వ్యాఖ్యలు ప్రజల్లో కి బలంగా వెళ్లిపోయాయి. అయితే పవన్ స్పీచ్ ఇస్తున్న సమయంలో సైతం మీడియా కవరేజ్ ఆపేయండి అంటూ పలు చానల్స్ కి తాడేపల్లి నుండి విపరీతంగా ఫోన్లు వచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
జన సేన రాజకీయ కార్యక్రమాలకు గత కొంత కాలంగా మీడియా కవరేజ్ సరిగా దక్కడం లేదు. 2019 లో జన సేన కు మరీ తక్కువ సీట్లు రావడానికి ఇది కూడా ఒక కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్సీపీ మంత్రులు పవన్ ని ఒంటరిని చేసి తీవ్ర స్థాయి లో దాడులు చేయడం, పోసాని కృష్ణ మురళి లైవ్ లో పవన్ పై బూతుల పంచాంగం వినిపించడం వంటి పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో నిన్నటి పవన్ స్పీచ్ కి దాదాపు అన్ని చానల్స్ బలమైన కవరేజ్ ఇచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ కి మీడియా కవరేజ్ దక్కకుండా చేయడం కోసం వైఎస్ఆర్సిపి మంత్రులు పలు ప్రయత్నాలు చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ స్పీచ్ మధ్యాహ్నం 12:30 సమయంలోనే ప్రారంభం కావలసి ఉంది. మంత్రి పేర్ని నాని సినీ పెద్దలకు అపాయింట్మెంట్ కూడా ఉదయమే ఇచ్చి, మధ్యాహ్నం పవన్ స్పీచ్ సమయంలో తన ప్రెస్ మీట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటలకు వేరే కారణాల వల్ల మార్చుకున్నారు. అది తెలియగానే పేర్ని నాని కూడా సినీ పెద్దలతో సమావేశాన్ని కొద్ది గంటలపాటు పోస్ట్ పోన్ చేశారు. సరిగా పవన్ కళ్యాణ్ స్పీచ్ సమయం లో తన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అలాగే పవన్ స్పీచ్ జరుగుతున్న సమయం లో మీడియా కి పలు రకాల లీకులు వదిలారు. చిరంజీవి క్షమాపణ చెప్పాడని, సినీ ఇండస్ట్రీ పవన్ తో లేదని, సినీ పెద్దలు తమ భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, ఇలా పలు రకాల లీకులు మీడియాకు ఇచ్చారు. అయితే సాక్షి ఛానల్ మినహాయించి దాదాపు మిగతా అన్ని చానల్స్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రసారం అయింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తి అయిన తర్వాతే పేర్ని నాని ప్రెస్ మీట్ ని చానల్స్ ప్రసారం చేశాయి.
అయితే పవన్ స్పీచ్ జరుగుతున్న సమయం లోనే పలు చానల్స్ కి తాడేపల్లి నుండి విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి గారి ప్రెస్ మీట్ జరుగుతున్నందున పవన్ స్పీచ్ కవరేజ్ ఆపేసి మంత్రి గారి ప్రెస్ మీట్ ప్రసారం చేయాల్సిందిగా పలు అగ్ర చానెల్స్ పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. అయితే చానల్స్ కూడా, ఈ సమయంలో ఏమీ చేయలేమంటూ వారికి తెలియజేసినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ స్పీచ్ కి మీడియాలో కవరేజ్ రాకుండా చేయాలని కి వైకాపా పెద్దలు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి అన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా, సినిమా పెద్దలు పవన్ తో కాకుండా ప్రభుత్వం వైపు ఉన్నారని పేర్ని నాని వ్యాఖ్యలు చేసినప్పటికీ, ” పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదు” అనే ఒక స్ట్రెయిట్ స్టేట్మెంట్ ని దిల్ రాజు తో కానీ, నిన్న భేటీకి హాజరైన ఇతర పెద్దలతో కానీ వైఎస్సార్సీపీ మంత్రి పేర్ని నాని ఇప్పించ లేక పోయారనే చర్చ కూడా జరుగుతోంది.
ఏది ఏమైనా వై ఎస్ ఆర్ సి పి పెద్దలు ఒత్తిడి తెచ్చినప్పటికీ లొంగ కుండా పవన్ కళ్యాణ్ కి మీడియా కవరేజ్ ఇవ్వడం రాజకీయ విశ్లేషకుల లో కొత్త చర్చ కు దారి తీసింది