కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అడ్డగోలుగా అక్రమాలు చేసి టీడీపీని ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అతిశయం అంతా ఇంతా కాదు. అసెంబ్లీలో చంద్రబాబు మొహం ఎలా చూపిస్తారని సెటైర్లు వేశారు. నానా మాటలన్నారు. కానీ చంద్రబాబు నిగ్రహంగా ఉన్నారు. కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరికీ మొహం చూపించలేని పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే.. కనీస ఓట్లు, సీట్లు కూడా సాధించలేకపోతున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అన్ని సీట్లను కూడా సాధించలేకపోకపోతోంది. కేబినెట్ లో ఉన్న మంత్రులంతా ఘోరంగా ఓడిపోతున్నారు. అలా ఇలా కాదు..కనీస పోటీ ఇవ్వలేనంత ఘోరంగా ఓడిపోతున్నారు. వారందరి ఓటమికి జగన్ రెడ్డే కారణం. వారందరికr ఆయన సమాధానం చెప్పుకోవాల్సిందే. జగన్ రెడ్డే తమ వెనుక ఉంటారని వారంతా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అలా ప్రవర్తించేలా చేశారు. దీనికి పర్యవసానాలను జగన్ రెడ్డి అనుభవించాల్సి ఉంటుంది.
రాజకీయాలను వ్యక్తిగత కక్షల స్థాయికి తీసుకుపోయిన జగన్ రెడ్డి.. తన గొయ్యి తాను తవ్వుకున్నారు. రాజకీయాల్లో విజయం వ్యక్తిగతం కాదని.. ప్రజల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారు. చివరికి అన్నీ కోల్పోయి రోడ్ున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్ తన మొహన్ని ప్రజలకు కూడా చూపించలేరు