చంద్రబాబు హయాంలో కడపలో ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ట్రూజెట్తో పాటు రెండు, మూడు ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు సర్వీసులు కూడా నడిపాయి. అయితే ఆ సర్వీసులన్నీ ఈ ఏడాది ఆగిపోయాయి. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండానే అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కడపకు వెళ్లాలంటే వాయు మార్గం లేదు. వెళ్తే బెంగళూరు లేదా చెన్నై వెళ్లి రోడ్డు మార్గం ద్వారా కడపకు రావాలి. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుబాబు సీఎం జగన్కు లేఖ ద్వారా తెలిపారు. తమ హయాంలో కడపకు విమానాలు నడిపించడానికి తీసుకున్న చర్యలను వివరించారు.
విమాన సర్వీసుల వల్ల ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుందని… పెట్టుబడిదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గుర్తుచేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉడాన్ పథకం కింద సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉడాన్ పథకం కింద త్వితీయశ్రేణి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ప్రధానంగా కడపకు సర్వీసులు నడిపే ట్రూజెట్ లాంటి సంస్థలు సర్వీసులు నిలిపివేశాయి. ఇతర ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా ఉంతే.
ఇప్పుడు చంద్రబాబు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తక్షణం ఉడాన్ కింద సర్వీసులు నడపాలని కోరుతున్నారు . సీఎం జగన్ సొంతజిల్లా కడప కావడంతో ప్రతిష్టాత్మంగా అయినా తీసుకుని సర్వీసుల్ని కొనసాగేలా చేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంది. కర్నూలు ఎయిర్ పోర్టు ప్రారంభమైన తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. కర్నూలుకు కూడా ఒక్కటంటే ఒక్క సర్వీస్ ను ఇండిగో నడుపుతోంది.