జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ జరుపుకోవడానికి పులివెందుల వస్తున్నారు. క్రిస్మస్ వేడుకల కోసం వస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో చేరుకుంటారు. గత వారం ఓ పెళ్లికి ఆయన కర్నూలు వెళ్లారు. బెంగళూరు నుంచే వెళ్లారు. ఇప్పుడు పులివెందుల వెళ్తున్నారు.. బెంగళూరు నుంచే వెళ్తున్నారు. ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ వయా బెంగళూరు ఖరారు చేస్తున్నారు. వారానికి ఓ మూడు రోజులు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో బస చేస్తున్నారు. ఏదో ఓ జిల్లా నేతల్ని పిలిపించుకుని తాను రోజూ వేసే క్యాసెట్ వేస్తున్నారు.
పులివెందులకు క్రిస్మస్ వేడుకల కోసం వస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఉంటారు. నాలుగు రోజులు అంటే.. జగన్ స్టైల్లో అది రెండురోజులు అని అర్థం. ఈ రోజు సాయంత్రం ఆయన పులివెందుల వస్తే.. ఇరవై ఏడో తేదీన ఉదయం బెంగళూరు వెళ్లిపోతారు. అంటే రావడానికి . పోవడానికి అయిన రోజులు కూడా కలిపేసి నాలుగు రోజుల పర్యటన అన్నమాట. గతంలో ఇలాగే దీక్షలు చేసేవారు. రెండురోజుల నిరాహారదీక్ష అని.. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించి.. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగించేవారు. అంతే రెండు రోజుల దీక్ష అవుతుంది.
పులివెందులలోఈ క్రిస్మస్ వేడుకలు కళా విహీనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మొహం చూసేందుకు తల్లి, చెల్లి ఇష్టపడే సూచనలు కనిపించడం లేదు. వారిపై ఆయన కోర్టులో కేసులు వేసిన తర్వాత జగన్ అయినా వారికి తన మహొం ఎలా చూపించగలరనే సందేహం బంధువుల్లో ఉంది. ఆయనకు ఎలా నటించాలో తెలుసుకాబట్టి నేరుగా వెళ్లినా.. తల్లి, చెల్లి మాత్రం ఆయనకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు. అందరూ కలిసి ప్రార్థనాల్లో పాల్గొంటారా లేదా అన్న సందేహం కూడా బంధువుల్లో వ్యక్తమవుతోంది.