తెలుగులో వందకోట్ల వసూళ్ళు (షేర్) సాధించిన సినిమాలు మూడంటే మూడు మాత్రమే ఉన్నాయ్. అందులో ఫస్ట్ ప్లేస్ ‘బాహుబలి2… 310.25 కోట్లు’ది. సెకండ్ ప్లేస్ ‘బాహుబలి… 183.75 కోట్లు’ది. థర్డ్ ప్లేస్ ‘ఖైదీ నెంబర్ 150… 102.05’ది. బాహుబలి వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇక, మెగాస్టార్ చిరంజీవి నటించిన రీఎంట్రీ సిన్మా అంత కలెక్ట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. ప్రేక్షకులు ఊహించిన వసూళ్ళే.
Click here for Tollywood Worldwide Top Lifetime Shares
యాభై కోట్ల నుంచి వంద కోట్ల వసూళ్ళు (షేర్) సాధించిన సినిమాలు పదహారు ఉన్నాయ్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. వాళ్ళందరికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. దాంతో కొంత ముందుగా స్టార్డమ్ వచ్చింది. తాతయ్యలు, తండ్రులను అభిమానించే ప్రేక్షకులు వీరినీ అభిమానిస్తున్నారు. బట్, ఫర్ ఎ చేంజ్… ఈ లిస్టులో చోటు కోసం ఏ బ్యాగ్రౌండ్ లేని నాని ట్రై చేస్తున్నాడు. టార్గెట్ 50 కోట్లు… నాని న్యూ మిషన్! విజన్! 50 కోట్ల షేర్ సాధించగల సత్తా నానికి ఉందా? కుదురుతుందా? క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి.
నాని లాస్ట్ సిన్మా ‘ఎంసిఎ’ 42 కోట్లు కలెక్ట్ చేసింది. నిజం చెప్పాలంటే.. ‘ఎంసిఎ’కు గొప్ప రివ్యూలు ఏం రాలేదు. నాని ఇమేజ్, అతడిపై నమ్మకంతో ప్రేక్షకులకులు థియేటర్లకు వచ్చారు. అదే నిఖార్సైన మంచి సినిమా పడితే… 50 కోట్లు కొట్టడం నానికి పెద్ద కష్టమేమీ కాదు. ఇటీవల స్టార్ హీరోల సినిమా వసూళ్ళలో అమెరికా కీ రోల్ ప్లే చేస్తుంది. అక్కడి మార్కెట్లో నానికి మంచి ఇమేజ్ ఉంది. అమెరికా ప్రేక్షకులు భారీ యాక్షన్, మాస్ కమర్షియల్ సినిమాల కంటే మంచి వినోదంతో కూడిన సినిమాలకు ఓటేస్తున్నారు. ముఖ్యంగా నాని చేసే సినిమాలు అక్కడి ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. నిర్మాతగా నాని తీసిన ‘అ !’కి మిల్లియన్ డాలర్స్ కట్టబెట్టారు.
Click Here for MCA BoxOffice Report
నాని సినిమాల లైనప్ చూసినా 50 కోట్ల వసూళ్ళు ఎంతోదూరంలో లేవని అనిపిస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’, నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం చేస్తున్న మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. ఇద్దరూ ఫ్యామిలీతో కలసి చూసేలా మంచి కామెడీ సినిమాలు తీసేవారే. ఆ సినిమాలు హిట్టయితే 50 కోట్ల షేర్ ఈజీగా వస్తుంది. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి స్టార్ దర్శకులు నానితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోలతో వీరిద్దరూ తీసిన సినిమాలు 50 కోట్ల షేర్ కలెక్ట్ చేశాయి. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తీసిన ‘అ ఆ’కి 48 కోట్ల షేర్ వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వ మాయాజాలానికి నాని తోడైతే కోట్లు కష్టమా చెప్పండి!
సిన్మా సిన్మాకీ తన ఇమేజ్, రేంజ్, మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నాని. అందుకనే అతడితో సిన్మాలు నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ వంటి బడా బడా నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. స్టోరీ సెలక్షన్, యాక్టింగ్, స్టోరీకి తగ్గట్టు, అందులోని క్యారెక్టర్‌కి తగ్గట్టు సిన్మాలో బిహేవ్ చేయడం ద్వారా ప్రామిస్సింగ్ అండ్ గ్యారెంటీ హీరోగా నాని పేరు తెచ్చుకున్నాడు. అతడి దూకుడు చూస్తుంటే త్వరలో 50 కోట్ల షేర్ క్లబ్బులో చేరేలా కనిపిస్తున్నాడు.
(షేర్. అంటే… డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు వగైరా వగైరా పోనూ నిర్మాత జేబులోకి వచ్చేది)