ఓట్లు వేయకుండా ఆపలేకపోయారు. కనీసం వారి ఓట్లను చెల్లకుండా చేయాలని వైసీపీ తాపత్రయ పడుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని సరైన సీల్ లేకుండా పెద్ద ఎత్తున ఓట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయించారు. హమ్మయ్య ఇక ఆ ఓట్లు చెల్లవనుకున్నారు. కానీ తీరా ఈసీ చెల్లుతాయని ఉత్తర్వులు ఇవ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అందుకే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు రేపుతామని.. ఘర్షణలు జరిగితే ఈసీదే బాధ్యతని చెబుతున్నారు. అంతేనా అసలు రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కేంద్రాలకు వద్దని సజ్జల గారు సెలవిచ్చారు. గొడవలు పెట్టుకునే వారే వెళ్లాలని సలహాలు కూడా ఇచ్చారు. అంటే పోస్టల్ బ్యాలెట్స్ చెల్లవని వాదించాలని ఆయన సలహా. గొడవలు చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తామని సీఈవో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయినా వైసీపీలో ఎన్ని కేసులకు గురయితే అంత గుర్తింపు కాబట్టి కొంత మంది రెడీగానే ఉంటారు.
ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ కేవలం బ్యాలెట్ బాక్సుల్లో పడిన ఉద్యోగుల ఓట్ల గురించే ఆలోచిస్తోంది. వారి కుటుంబసభ్యులు.. ఎన్నికల విధుల్లో పాల్గొనని ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు ఎలా ఓటు వేసి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఈ కొద్ది వాటిని టార్గెట్ చేసుకుని రచ్చ చేసుకుంటే.. మిగతా వాటిని చెల్లకుండా చేయలేరుగా. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చెల్లవు. అందుకే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి కామ్ గా ఉంటే పరువు అయినా దక్కుతుందని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు.