ఆరెస్సెస్ పై ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మాట మార్చారు. యూటర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని సుప్రీం కోర్టుకు తెలిపారు. కోర్టు విచారణకు సిద్ధమని
ప్రకటించారు. 15 రోజుల క్రితమే, ఇదే కేసులో రాహుల్ గాంధీ మరో విధంగా వాదన వినిపించారు. తనపై దాఖలైన పరువు నష్టం దావాను కొట్టి వేయాలని కోరారు. ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమని తెలిపారు.
ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది. 1948లో మహాత్మా గాంధీని ఆరెస్సెస్ వారే హత్య చేశారనేది రాహుల్ గాంధీ ఆరోపణ. కోర్టు విచారణకు సిద్ధపడ్డారంటే, ఆ ఆరోపణను రుజువు చేయాల్సి ఉంటుంది. గాంధీజీని ఆరెస్సెస్ కు చెందిన వారే హత్య చేశారనో చేయించారనో నిరూపించాల్సి ఉంటుంది. ఇక రాహుల్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అప్పుడే ఆరెస్సెస్, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
గాంధీజీని ఆరెస్సెస్ వారే హత్య చేశారని రుజువు చేయడం అంత ఆషామాషీ కాదంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో రాహుల్ చాలా రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గాంధీజీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే ఆరెస్సెస్ సభ్యుడా కాదా అనేది మొదటి ప్రశ్న. ఒక వేళ సభ్యుడైతే అందుకు ఆధారాలను చూపాల్సి ఉంటుందట. ఒక వేళ గాడ్సే ఆరెస్సెస్ సభ్యుడని రుజువు చేసినా, ఆ సంస్థకు చెందిన వారు హత్యచేయించారని రుజువు చేయడం సాధ్యమా అనే చర్చ జరుగుతోంది.
బీజేపీ నేతలపై విమర్శలు చేసేటప్పుడు తరచూ ఆరెస్సెస్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటు. సమాజంలో విషపూరితమైన వాతావరణాన్ని ఆరెస్సెస్వ్యా పింప చేస్తోందని, ప్రజలను విడగొడుతోందని ఆరోపించే వారు. తర్వాత క్రమంగా ఆరోపణలు పదునెక్కాయి.
సంఘ్ పై విమర్శల్లో రాహుల్ గాంధీ క్రమంగా తీవ్రత పెంచారు. ఏకంగా గాంధీజీ హత్యకే లింక్ పెడుతూతీవ్ర ఆరోపణ చేశారు. దీంతో మహారాష్ట్రకు చెందిన ఓ ఆరెస్సెస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు. ఈ దావానుకొట్టివేయాలని మొదట కోరిన రాహుల్, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.విచారణకు సిద్ధమన్నారు. మరి, గాంధీజీ హత్యకు ఆరెస్సెస్ వారే కారణమని ఎలా నిరూపిస్తారనేది ఆసక్తికరం.