సోనియా గాంధీ.. తెలంగాణలో బహిరంగసభలో పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఇతర నాలుగు రాష్ట్రాల్లో సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో ఎన్నికలలో ప్రచారం చేయలేదు. కానీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. దీనికి కారణం.. సోనియా గాంధీకి తెలంగాణలో ఓ పాజిటివ్ ఇమేజీ ఉంది. రాజకీయంగా రిస్క్ తీసుకుని కూడా… తీవ్రంగా నష్టపోతామని తెలిసి కూడా.. తెలంగాణ ఇచ్చినటువంటి నాయకురాలు…సోనియా గాంధీ.
సోనియా పర్సనల్ కమిట్మెంట్ వల్లే తెలంగాణ వచ్చిందా..? :
గతంలో జై ఆంధ్రా ఉద్యమం జరిగినప్పుడు… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ను విభజించను అని చెప్పిన నాయకురాలు ఇందిరాగాంధీ. రాజకీయాల్లో ఉన్న సోనియా గాంధీ.. సన్నిహితులు చెప్పేదేమిటటంటే… తెలంగాణ ఏర్పాటులో కచ్చితంగా పొలిటికల్ కాలిక్యూలేషన్ ఉంది. తెలంగాణ ఏర్పాటు చేస్తే తెలంగాణలో అయినా రాజకీయంగా లాభపడతామని ఆశించారు. అందులో అనుమానం లేదు. దానితో పాటు… సోనియా గాంధీలో… మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉందని చెబుతారు. మాట ఇచ్చాను.. నిలబెట్టుకోవాలి.. మాట ఇప్పించారు.. అమలు చేయాలన్నారు. ఎందుకంటే.. 2004లో రాజశేఖర్ రెడ్డి నే…కరీంనగర్ సభలో.. మీ ఆకాంక్షలు నాకు తెలుసు. సరైన సమయంలో నెరవేరుస్తానని ప్రకటించారు. అలాగే.. కామన్ మినిమం ప్రోగ్రామంలో కూడా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పెట్టారు. అందువల్ల చాలా మంది నేతలకు సోనియా గాంధీ.. చెప్పేవారు.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలేదని కమిట్మెంట్ అని .. ఇస్తానని చెప్పేవారని.. కాంగ్రెస్ నేతలతో పాటు టీఆర్ఎస్, టీజేఎస్ నేతలు కూడా చెబుతూ ఉంటారు. అంటే.. సోనియా గాంధీ పర్సనర్ కమిట్ మెంట్ లేకుండా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. అందులో అనుమానమే లేదు.
ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లని సోనియా తెలంగాణకు ఎందుకొచ్చారు..? :
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా… సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని… ఆమె లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదని… అసెంబ్లీలో ప్రకటించారు. పైగా.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాను కలిశారు. అందుకే.. కేసీఆర్ రాహుల్ గాంధీని విమర్శించవచ్చు కానీ.. సోనియా గాంధీని విమర్శిస్తే.. నెగెటివ్ గా ఉంటుంది. అందుకే సోనియా గాంధీని టీఆర్ఎస్ టార్గెట్ చేయడం చాలా కష్టం. సోనియా గాంధీ మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడం లేదు. తెలంగాణకు మాత్రమే ప్రచారం చేశారు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అలాగే తెలంగాణలో కూడా.. సోనియాకు ఉన్న ఇమేజ్ ను ఉపయోగించుకుంటే.. మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అనుకున్నారు. కొన్ని సర్వేల్లో… తెలంగాణతో సహా… నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తేలింది. అందుకే.. సోనియా గాందీతో ప్రచారం చేయించారు.
సోనియాను కేసీఆర్ విమర్శిస్తే నెగెటివ్ అవుతుందా..? :
సోనియా గాంధీ.. వచ్చి కేసీఆర్ ను విమర్శించి వెళ్లారు. అయితే.. కేసీఆర్ మాత్రం.. సోనియా గాంధీని అంతే తీవ్ర స్థాయిలో విమర్శించలేరు. విమర్శిస్తే ఇబ్బంది అవుతుంది. ఒక వేళ విమర్శించినా కూడా.. అది ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ.. కేసీఆర్ సోనియా గాంధీని పొగిడారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి విమర్శిస్తే ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి.అందుకే…సోనియా ప్రచారం ప్రజాకూటమికి ఊపుని తెస్తుంది. అయితే ఒక్క మీటింగ్ తోనే.. ఒక్క నాయకులురాలిసభతోనే.. ఒక్క హామీతోనే..ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. ఎన్నికల్లో గెలుపు విషయంలో ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి.