జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకీ గర్జనలు? పేరుతో సోషల్ మీడియాలో సంధిస్తున్న ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. పదిహేనో తేదీన విశాఖలో మూడు రాజధానుల కోసం అంటూ గర్జన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ప్రకటించారు. దీనికి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో వరుస ప్రశ్నలు సంధించారు. వైసీపీ వైఫల్యాలు మొత్తం … సూటిగా సుత్తి లేకుండా పవన్ కల్యాణ్ ఎత్తి చూపారు. అమరావతి అంశంపై మాట తప్పిన అంశం దగ్గర్నుంచి మద్య నిషేధ హామీ విషయంలో మడమ తిప్పడం వరకూ ప్రతీ అంశాన్ని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
ఆదివారంరాత్రి నుంచి ఈ ట్వీట్ల పరంపర సాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు మెత్తాన్ని పవన్ తన పోస్టుల ద్వారా ప్రజల ముందు ఉంచారు. విస్తృతమైన చర్చ జరగడానికి అవకాశం కల్పించారు. ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రతీ వర్గం ఇబ్బంది పడింది. మద్యం ధర ల పెంపు, ఇసుక దోపిడి…సహా నిరుపేదల్ని దోచుకుంటున్న వైనాన్ని ప్రశ్నల రూపంలో పవన్ ప్రజల ముందు ఉంారు. ఇవన్నీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ నేతల వ్యవహార శైలిని ప్రజల ముందు ఉంచుతున్నాయి.
వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల్ని సమస్యల్లో ముంచెత్తడం.. సంబందం లేని అంశాలకు చర్చకు పెట్టడం చేస్తున్నారు. ఒకప్పుడు అమరావతి రాజధానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి.. ఎన్నికల్లోనూ అమరావతే రాజధాని అని చెప్పి.. తీరా గెలిచిన తర్వాత మూడు రాజధానుల మాట మార్చిన వైసీపీ నేతల తీరు కూడా ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ సంధించిన ప్రశ్నలకు తూటాల్లా పేలుతున్నాయి. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెబుతారా ? లేకపోతే మళ్లీ పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి సరిపుచ్చుతారా అనేది వేచి చూడాలి.