ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ మంత్రులను కంట్రోల్ చేయడానికి సజ్జల.. కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ప్రణాళిక వేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వారికి వైసీపీ నేతలు అంత దూకుడుగా కౌంటర్ ఇవ్వడం లేదు. జోరు తగ్గించమని సజ్జల నుంచి సూచనలు వచ్చాయేమో కానీ ఆదివారం పెద్దగా వైసీపీ నేతలు టీఆర్ఎస్పై విరుచుకుపడలేదు. అయితే టీఆర్ఎస్ ఏం అన్నా సరే.. రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినే స్థాయిలో విమర్శలు చేయకూడదన్న ఓ కట్టుబాటు ఫాలో కావాలని వైసీపీ నిర్ణయించుకుంది.
దీనికి కారణం .. టీఆర్ఎస్ తో శత్రుత్వం అంటూ ఏర్పడితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలకుబాగా తెలుసు. గతంలో టీడీపీతో ఉన్న అలాంటి శత్రుత్వం వల్ల తమకు జరిగిన మేలు ఏంటో కూడా తెలుసు. అందుకే తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తో గొడవలు పెట్టుకోకూడదని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ పడుతున్నారు. రాజకీయంగా పరస్పరంసహకరించుకుంటున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణలో యధేచ్చగా టీడీపీ నేతల్ని వేటాడుతున్నారంటే దానికి తెలంగాణ పోలీసులు… ప్రభుత్వ సహకారం లేదని అనుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సహకారం వైసీపీకి ముందు ముందు చాలా అవసరం. వాటిని కోల్పోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండదు.
ఒక్క పోలీసుల విషయంలోనే కాదు ఇతర ఆర్థిక పరమైన అంశాల విషయంలనూ హైదరాబాద్ కీలకం. అక్కడ తేడా కొడితే వైసీపీ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత ఏపీ అధికార పార్టీ అయినా… ఎన్నికలకు నిధులన్నీ హైదరాబాద్ నుంచి సమకూర్చుకోవాలి. ఈ విషయంలో కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఏమవుతుందో వైసీపీకి బాగా తెలుసు. అందుకే .. కేసీఆర్ ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా.. వైసీపీని విమర్శిస్తున్న ఆ పార్టీ నేతల వరకే పరిమితం అవ్వాలని వైసీపీ నేతలకు సూచనలు వెళ్లాయి. అయితే సతజ్జలే.. హరీష్‌ను టార్గెట్ చేసేందుకు కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడంతో విషయం సీరియస్ అయింది.