హిందూపురం నియోజకవర్గంలో ఆరు రోజులు మకాం వేసి బాలకృష్ణను ఓడిస్తానంటూ.. సవాల్ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సమావేశాలకు పట్టుమని పది, ఇరవై మందిని రప్పించుకోలేకపోతున్నారు. మొదటి రోజు ఆయన నిర్వహించిన సమావేశాలకు జనం అసలు లేకపోవడంతో.. పరిశ్రమ కార్మికుల్ని పంపించాలని యాజమాన్యాలను ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయే సరికి కరెంట్ తీసేశారు. దీంతో అందర్నీ కంపెనీ బస్సుల్లోనే మంత్రి పెద్దిరెడ్డి సమావేశానికి పంపించారు.
పరిశ్రమలపై ఈ రకమైన వేధింపులకు పాల్పడటం… ప్రభుత్వ దౌర్జన్యానికి సాక్ష్యం అయితే.. అసలు ఇలాంటి భయాలతో ఓట్లు ఎలా వేయించుకుంటారన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. పెద్దిరెడ్డి రాజకీయం చేయడానికి వారం రోజులు పర్యటిస్తే.. ప్రజలంతా… పనులకు వెళ్లకుండా.. ఆ నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు తెరవకుడా చేసి.. కూలీ పనులు చేసుకునే వారిని పంపించాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. వైసీపీ నేతలు చేసిన ఆగడాలను చూసి.. చాలా మంది ఫైర్ అవుతున్నారు. పొరపాటున ఎమ్మెల్యే కూడా వైసీపీ వ్యక్తి వస్తే ఇక పరిశ్రమలు.. ప్రజలు బతకరన్న భయం అక్కడి ప్రజల్లో వినిపిస్తోంది. అసలు పార్టీ మీటింగ్ పెడితేనే ఎవరూ రారు.. అలాంటిది… హిందూపురంలో గెలిచేస్తామనిపెద్దిరెడ్డి డాంబికాలు పోతున్నారు.