ఈమధ్య రీమిక్స్ సంప్రదాయం మరింత జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి పాటల్ని అటు రామ్‌చరణ్, ఇటు సాయిధరమ్ తేజ్ ఇద్దరూ మూకుమ్మడిగా వాడుకొంటున్నారు. మరి మీకెందుకు అలాంటి ఆలోచన రాలేదు…?? అని అల్లు అర్జున్‌ని అడిగితే.. ”చిరంజీవి గారి పాటల్ని ముట్టుకోవడం, రీమిక్స్ చేయాలనుకోవడం అత్యంత పెద్ద సాహసం. అది నేనెప్పుడూ చేయను” అంటున్నాడు.
ఎందుకు అని ఆరా తీస్తే..? ”చిరంజీవి గారు ఓ స్టెప్ వేశారంటే 100 పక్కాగా ఉంటుంది. దాన్ని బెటర్‌గా చేయాలనుకోవడం అవివేకం. చిరంజీవి పాట నేను చేస్తే అవే స్టెప్పుల్ని మళ్లీ దించేయాలి. ఎంత కష్టపడినా చిరంజీవిగారిలోని గ్రేస్‌ని మళ్లీ చూపించడం అసాధ్యం. అందుకే ఆయన పాటల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాను తప్ప.. మళ్లీ రిపీట్ చేయలేను.. చేయను” అంటున్నాడు. మరి రామ్ చరణ్, సాయిధరమ్లు చేస్తున్నారు కదా? అని అడిగితే “అది వాళ్లిష్టం. వాళ్లు చేస్తే నాకూ చూడాలనిపిస్తుంది. నన్ను చేయమంటే మాత్రం ఒప్పుకోను“ అని నిర్మొహమాటంగా చెప్పేశాడు బన్నీ.