ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి విశాఖ నుంచి పాలన సాగించడానికి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటిస్తున్నారని.. ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘాలు ఈ మేరకు… అక్కడకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు… సెక్రటేరియట్‌ను తరలించాలని.. ఆ తర్వాత తరలిస్తే.. ఇబ్బందులు వస్తాయని.. ఉద్యోగులు చెబుతున్నారు. పిల్లలను స్కూళ్లలో చేర్పించుకోవడానికి.. విద్యా సంవత్సరం ప్రారంభం లోపే.. తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఏపీ సర్కార్ కూడా దీనికి సుముఖంగా ఉందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది.
దీంతో.. వెంటనే.. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ నెల 4న పిటిషన్ విచారణకు రాకపోవడంతో మళ్లీ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని తరలింపు కోసం ముహూర్తం పెట్టారని జరుగుతున్న ప్రచారంపై.. గత నెల 24నే పిటిషన్ వేసినట్లు గుర్తుచేసిన తిరుపతిరావు తరపు న్యాయవాది మురళీధర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన చేసింది. చట్ట సభల్లో బిల్లులు పెండింగ్, హైకోర్టులో పిల్లు ఉన్నాయన్న ప్రభుత్వం తన కౌంటర్లో తెలిపింది. సచివాలయ ఉద్యోగుల సంఘం చేసినట్లు చెబుతున్న తీర్మానంపై.. ఆధారపడి వ్యాజ్యం దాఖలు చేశారు.. అది ఊహాగానం మాత్రమేనని .. చట్ట సభల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ పిటిషన్లు చెల్లుబాటు కావని ప్రభుత్వ తరపు న్యాయవాది కౌంటర్లో పేర్కొన్నారు.
రాజధానిని తరలించాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వానికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. మూడు రాజధానుల కోసం పెట్టిన బిల్లు శాసనమండలిలో ఆగిపోయింది. శాసనమండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ ఫైల్ కేంద్రం వద్ద ఉండిపోయింది. మరో వైపు రైతులు… పెద్ద ఎత్తున న్యాయం కోసం కోర్టుల్లో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. కోర్టులు పలుమార్లు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. కర్నూలుకు రెండు విభాగాల తరలింపుపై ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పు కూడా ఇచ్చింది. ప్రభుత్వం మాత్రం.. పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో ఉందని అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెబుతున్నారు.