గత ఐదు సంవత్సరాలుగా తాము చేసిందే మంచి, తాము చెప్పిందే వేదం అన్నట్లుగా సాగిన మాజీ మంత్రి కొడాలి నానికి వరుసగా ఇబ్బందులు మొదలయ్యాయి.
ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, అంతకు ముందున్న వివాదాలపై కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు రిజిస్టర్ అయ్యింది. కొడాలి నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది.
తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు అయ్యింది.