రాజకీయ ప్రత్యర్థులందర్నీ కేసుల్లో ఇరికించి.. ఎన్నికల సమయంలో కదలకుండా చేసి ఓట్లు గుద్దేసుకోవాలన్నది సీఎం జగన్ ప్రణాళిక. పవన్ కల్యాణ్ పైనా దాన్ని అమలు చేస్తున్నారు. ఎప్పుడో వాలంటీర్లపై అన్నారని ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆ కేసును కోర్టు తిప్పి పంపినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదయిందని.. మార్చి 25న విచారణకు రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత జూలైలో వాలంటీర్ల అకృత్యాలపై పవన్ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపమల ప్రకారం అమ్మాయిల మిస్సింగ్ నిజమేనని కేంద్రం డాటా రిలీజ్ చేసింది. యఅయితే వాలంటీర్లు పై తప్పుడు ఆరోపణలు చేశారని.. పవన్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేసింది. ఓ వాలంటీర్ తో ఫిర్యాదు కూడా ఇప్పించింది. ఇదంతా పవన్ కల్యాణ్ పై చేస్తున్న రాజకీయ కుట్రగానే అనుమానిస్తున్నారు. వ్యవస్థల్ని వాడుకుని ఎన్నికల సమయంలో పవన్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
పవన్ పై ఫిర్యాదు చేయాలని కొంత మంది వాలంటీర్లను ప్రోత్సహించడం ద్వారా వారి జీవితాలతోనూ ప్రభుత్వం ఆడుకునే ప్రయత్నం చేసింది. వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అనేక చోట్ల వాలంటీర్లు చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి చెప్పినందుకే పవన్ ను టార్గెట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని నిర్బంధాలు పెట్టినా పవన్ .. వైసీపీని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని జనసేన వర్గాలంటున్నాయి.