ఎక్కడ చూసినా అఙ్ఞాతవాసి గురించే చర్చ. కత్తులు దూసినా అఙ్ఞాతవాసి మీదే ర్యాలీ లు చేసినా అఙ్ఞాతవాసి గురించే. తాజాగా ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై మరో వివాదం ముసురుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్ ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు పేరుగల వారి మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే దీన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
స్వయంగా న్యాయవాది అయి ఉండీ ఆయన ఈ కేస్ వేయడం గమనార్హం. “అసెంబ్లీ రౌడీ”, “ఐ లవ్యూ టీచర్” లాంటి సినిమా టైటిళ్ళ విషయం లోనే గతం లో కేసులు నిలబడలేదు. అలాగే రాజకీయ నాయకులని కానీ డాక్టర్లని కానీ పోలీసులని కానీ విలన్లుగా చూపించే సినిమాల మీద కేసులూ (మా ప్రొఫెషన్ ని విలన్లుగా చూపించొద్దంటూ వేసిన కేసులు) కోర్టులలో నిలబడలేదు. కాబట్టి “ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ” ని హరించేలా కోటేశ్వరరావు పాటని సినిమాలోనుంచి తీసివేయమని కోర్ట్ చెప్పకపోవచ్చు. మ్యాగ్జిమం “ఆ పాట ఉపయోగించి మీ మీద వ్యక్తిగతంగా ఎవరినా దాడి చేస్తే “స్పెసిఫిక్” గా వారి మీద కేసు పెట్టుకోవచ్చు” అని చెప్పవచ్చేమో కోర్ట్.