ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించారని బద్వేలులో షర్మిలపై కేసు పెట్టేశారు. ఎన్నికల రూల్స్ అతిక్రమించారని ఆమెపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేశారో స్లష్టత లేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించొద్దని ఈ మధ్య కాలంలోనే కడప కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే సీబీఐ చార్జిషీటులో ఉన్న అంశాలను ప్రస్తావించకుండా ఆపడం తమ గొంతు నొక్కడమేనని షర్మిల చెబుతున్నారు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తిరిగి జిల్లా కోర్టుకు పంపింది. జిల్లా కోర్టు 9వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అని.. ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
అయితే దిగువ కోర్టు ఇంకా సడలింపులు ఇవ్వక ముందే పదే వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారని షర్మిలపై కేసు నమోదు అయింది. రూల్స్‌కు వ్యతిరేకంగా కేసు అంశాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యర్థులను టార్గెట్ చేశారని ఫిర్యాదులో వైసీపీ లీడర్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. కనీసం ఈసీకి కూడా సమాచారం ఇవ్వకుండానే పోలీసులు కేసు నమోదు చేశారు.