ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు కొట్టేయడానికి ఆర్జీవీని తన సినిమాకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయని ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో స్పష్టంగా ఉంది. అంతా కలిపి రెండు పార్టులకు కలిపి రెండు వేలు వ్యూస్ కూడా రాలేదు. కానీ లక్షల వ్యూస్ వచ్చినట్లుగా ఫేక్ పత్రాలు సృష్టించి డబ్బులు కొట్టేశారు. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని నోటీసులు ఇచ్చారు. ఆ డబ్బులను రికవరీ చేసిన తర్వాత అసలు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వాన్ని మోసం చేయడం చాలా పెద్ద నేరం. ఇలా కుట్రపూరితంగా ఓ రాజకీయ ప్రచార సినిమా తీయడమే కాదు దానిపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కూతలు కూశారు. మార్ఫింగ్లు వేశారు. ఆ కేసులు అదనం. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నిండా మునిగిపోయాడన్నది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయనకు ఆదాయం లేదు. ప్రాజెక్టులు లేవు. ఆయనతో సినిమాలు చేసే వాళ్లూ కూడా లేరు. ఎవరైనా ఉచిత సలహాలు మాత్రమే అడుగుతున్నారు.
గతంలో తాను తీసిన సినిమాలను చూపించుకుని తాను లెజెండరీ డైరక్టర్ ను అన్న పేరు వాడుకుని ఆయన బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకుంటున్నారు. ట్విట్టర్ ఖాతాలను అద్దెకు ఇచ్చి ఈ పరిస్థితికి వచ్చారు. బలహీనమైన సోషల్ మీడియా కేసులో ఆయన బయటపడవచ్చు కానీ ఇలాంటి కేసుల్లో మాత్రం మూసేస్తారు. ఆర్జీవీ రెడీగా ఉండాల్సిందే.