మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసిన కేసులో ఆయన భార్యపై కేసులు నమోదయ్యాయి. మాములుగా ఆయనపై కేసులు నమోదవుతాయని అనుకున్నారు కానీ.. బియ్యం మాయం గోడౌన్లు ఆయన భార్య పేరు మీద ఉండటంతో తప్పించుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారి ఫిర్యాదుతో పేర్ని జుయసుధతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ బియ్యం మాయంపై పేర్ని నాని, జయసుధ విచిత్రమైన సమాధానం ఇచ్చారు. వేబ్రిడ్జి సరిగ్గా లేకపోవడం వల్ల తూకాల్లో తేడాలు వచ్చాయి కానీ నిజంగా బియ్యాన్ని మాయం చేయలేదని చెబుతున్నారు. వేబ్రిడ్జి మీద నెపం వేసి తప్పించుకుందామని ప్లాన్ చేశారు. అయితే అది నిరూపించడం సాధ్యం కాదు కాబట్టి.. ఎందుకైనా మంచిదని డబ్బులు లెక్క కడితే ఇస్తామన్న ప్రపోజల్ కూడాపెట్టారు.
వైసీపీ హయాంలో మంత్రిగా చేసిన పేర్ని నాని .. మచిలీపట్నంలో పలు చోట్ల గోడౌన్లు కట్టి పౌరసరఫరాల శాఖ బఫర్ గిడ్డంకులకు లీజుకు ఇచ్చారు. అంటే సరుకు అంతా వారి అధీనంలో ఉంటుంది. బియ్యాన్ని ఎవరికీ తెలియదని మాయం చేశారు. తమ ప్రభుత్వమే ఉంటుందని ఎవరికీ తెలియదని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చే సరికి కేసులు నమోదయ్యాయి.