అందర్నీ అరెస్టు చేస్తున్నారు కొడాలి నానిని ఎప్పుడు అని టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే వంశీకి, కొడాలికి ఇద్దరికీ ఇలా సోషల్ మీడియా కేసుల్లో కాదిని అసలు ట్రీట్ మెంట్ వేరే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఓ న్యాయవిద్యార్థిని విశాఖలో కొడాలి నాని బూతులతో మనస్థాపం చెందానని కేసు పెట్టారు. కేసు నమోదయింది.
ఈ కేసులో చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే కొడాలి నాని ఇప్పుడు అడ్రస్ లేరు. గుడివాడలో కనిపించడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు . తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చానన్నట్లుగా ఆయన తన సన్నిహిత మీడియాతో ప్రచారం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వల్లభనేని వంశీ కూడా అంతే. అయితే వారు రాజకీయాలకు దూరం అయినా సరే వదలబోరని.. ఖచ్చితంగా ట్రీట్ మెంట్ ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి.
చిన్న చిన్న కేసులు కాదని.. అధికారంలో ఉన్నపుడు .. జగన్ రెడ్డిని చూసుకుని నోటికి అడ్డూ అదుపూ లేకుండా చేసుకున్న నోటి విరేచనాలకు ఇప్పుడు ఖచ్చితంగా చికిత్స చేయాల్సిందేనని అంటున్నారు. ఈ విషయంలో వారు ఖండాంతరాలు దాటి వెళ్లినా తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆ ట్రీట్ మెంట్ కోసమే…కొంత మంది వైసీపీ నేతలతో పాటు… ఎక్కువ మంది టీడీపీ క్యాడర్ కూడా ఎదురుచూస్తున్నారు.