అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు. కానీ బల ప్రదర్శన చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. కార్యకర్తల్నీ తరలించారు. అందులో జనసేన జెండాలనూ వాడారు. చివరికి ఈ పర్యటన వివాాస్పదమయింది. దాంతో పోలీసులు ఓ చిన్న కేసు మోదు చేసి ఊరుకున్నారు.
కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ పోలీసులు్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల పోలీసులపై మండిపడింది. నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డీ , డీఎస్పీ, టూటౌన్ సీఐపై చార్జిషీట్ నమోదు చేయాలని ఆదేశించింది. అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అలాగే తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని ఆదేశించంది.
చాలా మంది అదికారులు ఇప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉన్న ఒకే సామాజికవర్గం అధికారులు ఏకపక్షంగా వ్యవహరి్సతున్నారు. వారిపై ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈసీ పరిశీలించి చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమయితే.. అది ఆయనపై కేసులే కాదు.. నంద్యాల పోలీసు అధికారులపైనా చర్యలకు కారణం అవుతోంది.