ఏపీలో అంతా మారిపోతోంది. కౌంటింగ్ కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే పరిణామాలు ఊహించని విధంగా మారుతున్నాయి. సకల శాఖా మంత్రి ఇంకా చెప్పాలంటే పోలీసులపై పూర్తి స్థాయి పట్టు సాధించి ప్రతిపక్ష నేతల్ని ఓ ఆట ఆడించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది.
కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో వైసీపీ రెండు రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టింది. ఇందులో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వాళ్లను కౌటింగ్ ఏజెంట్లుగా కూర్చొబెట్టొద్దని గట్టిగా నిలదీసేవాళ్లను ఉంచాలని కేడర్‌కు సూచించారు. రూల్స్ పాటించే కౌటింగ్ ఏజెంట్లు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలు కేడర్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తీసుకున్న తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు పెట్టారు.
న్యాయసలహా తీసుకుంటామని పోలీసులు తాత్సాహం చేస్తారని లేకపోతే అంతర్గత సమావేశలో చేసిన రాజకీయ వ్యాఖ్యలని ఊరుకుంటారని అందరూ అనుకున్నారు. పోలీసులు కేసు పెట్టేశారు. దీంతో వైసీపీ నేతలు కూడా ఏం జరుగుతోందా అని కంగారు పడుతున్నారు.