భారత రాష్ట్ర సమితి ఎన్నికల్లో గెలవడానికి డీప్ ఫేక్‌లను కూడా గట్టిగా నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. ఫేక్ న్యూస్ స్పెడ్ చేయడంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్ని రకాల హద్దులూ దాటిపోయింంది., ఫలితంగా కర్ణాటకలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరవాత తెలంగాణ కరెంట్ ను.. కర్ణాటకకు తీసుకెళ్తామని అక్కడి మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడారంటూ ఓ డీప్ ఫేక్ ఆడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా సర్క్యూలేట్ చేసింది. దీంతో వెంటనే కర్ణాటకలో కేసు నమోదయింది. మొదట ఆడీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పోస్టు చేసిన వారు డిలీట్ చేసినా.. వారి ఉద్దేశం దాన్ని ప్రజల్లోకి పంపడం. కాబట్టి పంపేశారు. కానీ కేసు నమోదయింది.
అంతకు ముందు ఏకంగా డీకే శివకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. మరీ ఓ తప్పుడు లేఖ సృష్టించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఫాక్స్ కాన్ ను బెంగళూరు తరలిస్తారని దాని సారాంశం. దీనిపైనా డీకే శివకుమార్ బెంగళూరులో కేసు పెట్టారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కర్ణాటకలో కేసులు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్ స్పెడ్ చేశారన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని..కరెంట్ ఉండదని.. హైదరాబాద్ నుంచి అన్నీ తీసుకెళ్తారని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. దాదాపుగా అన్నీ ఫేకే.
కర్ణాటకలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నేరుగా డిప్యూటీ సీఎంతో పాటు మంత్రుల వీడియోనే డీప్ ఫేక్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మారితే… కర్ణాటక కేసులతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యుల్ని టార్గెట్ చేసే చాన్స్ ఉంది. లేకపోతే కర్ణాటక పోలీసులు వదిలే అవకాశం ఉంది. అదే జరిగితే … రెండు వైపులా నిండా మునిగిపోయే పరిస్థితి వస్తుంది.