ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను హైకోర్టు అనుమతి లేకుండాఎత్తివేయడం సాధ్యం కాదని ఓ వైపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి రెండు రోజులు కాకుండానే ఏపీ సర్కార్ మరో ఘనకార్యం చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న ఓ క్రమినల్ కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని సోమిరెడ్డి ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. కొన్ని పత్రాలను విడుదల చేశారు.. పోలీసుల విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం సాగుతోంది.
ఈ సమయంలో హఠాత్తుగా కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలపై ఉన్న దాదాపుగా 45 కేసులను ఎత్తివేశారు. సీఎం జగన్ కేసులను ఎత్తివేయడంపై హైకోర్టులో సుమోటోగా విచారణ జరుగుతోంది. మరో వైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్పన్పటికీ… ఏపీ సర్కార్ కేసు ఎత్తివేతపై చర్యలు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ కేసులో బాధితుడు అయిన చంద్రమోహన్ రెడ్డి రాజీపడలేదు. ఆయన విచారణ జరిగి… నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. కానీ బాధితులకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు నేరం చేసిన సొంత పార్టీ నేతల్ని కాపాడటానికి దేనికైనా వెనుకాడబోమన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉంది.
అయితే ఇలాంటి కేసుల ఎత్తివేత నిర్ణయాలను హైకోర్టుకు కొట్టి వేస్తుందని అప్పుడు ఈ అంశంపై మరింత రచ్చ జరుగుతుందని..ఈ విషయం ప్రభఉత్వానికి తెలిసి కూడా.. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలను మాత్రం ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థను ఏ మాత్రం లెక్క చేయని ఏపీ సర్కార్ వైఖరి మరోసారి బయట పడిందని రాజకీయ వర్గాలు విమర్శలు ప్రారంభించాయి.