చింతమనేని ప్రభాకర్…మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించిన అఫిడవిట్ లో తనకున్న ఆస్తులు, కేసుల వివరాలను అందులో పొందుపరచారు.
ఆయన అఫిడవిట్ ను పరిశీలిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపై లేనన్ని కేసులు చింతమనేనిపైనే నమోదు అయినట్లుగా తెలుస్తోంది. గతంలో 30 కేసులు ఉండగా.. ఇప్పుడు అవి సెంచరీకి చేరువలో ఉన్నాయి. రౌడీషీట్ తోపాటు 93కేసులు నమోదైనట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిరచరస్తులన్నీ కలిపి సుమారు రూ.50కోట్ల పైచిలుకు ఉన్నట్లు చూపించారు.
ఏపీలో పెను ప్రకంపనలు రేపిన తహశీల్దార్ వనజాక్షి ఉదంతంతో సహా తనపై నమోదైన కేసుల వివరాలన్నింటిని పొందుపరిచారు చింతమనేని. అలాగే, మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడిచేసిన కేసులో చింతమనేని ప్రభాకర్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది.ఆయనపై నమోదైన కేసుల వివరాలు జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.