కాకినాడ పోర్టును కబ్జా చేసి మళ్లీ తిరిగి ఇచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేసులు మాత్రం అంత తేలికగా వదిలి పెట్టే అవకాశాలు లేవు. కేనును కొనసాగించేందుకే సీఐడీ నిర్ణయించుకుంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. వాటాలను అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయించేందుకు బెదిరింపులకు పాల్పడింది విక్రాంత్ రెడ్డేనని సీఐడీ హైకోర్టుకు తెలిపింది.
2020లో కాకినాడ సీ పోర్టుతో పాటు కాకినాడ సెజ్‌కు సంబంధించిన వాటాలపై హక్కులను వదులుకోవాలని పోర్ట్ ప్రమోటర్ కేర్ రావును తన ఇంటికి పిలిచి మరీ విక్రాంత్ బెదిరించారని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. కాకినాడ సీ పోర్టుకు రూ.3,666 కోట్లు, కాకినాడ సెజ్‌కు కూడా నష్టం చేకూర్చేలా చేశారని సీఐడీ స్పష్టంచేసింది. అంతే కాదు ఎడిటింగ్ సంస్థతో కుమ్మక్కు అయి తప్పుడు నివేదికలు రెడీ చేయించడం.. వాటితో నోటీసులు ఇప్పించడం లాంటివన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయన్నారు.
ఈ వ్యవహారంలో పోర్టును తిరిగి కేవీరావు ఔరో రియాలిటీ ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేసును మాత్రం సీఐడీ వదిలి పెట్టే అవకాశం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. న్యాయపరమైన అవకాశాలు ముగించిన తర్వాతనే పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి