తెలంగాణలో మరే సమస్యలు లేనట్లుగా కాంగ్రెస్, బీజేపీలు తమ అగ్రనేతల కులాలు, మతాలపై చర్చించుకుంటున్నాయి. కులగణన చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీ జనాభా తక్కువగా ఉందని ఆందోళనలు నిర్వహించింది. దీంతో కులగణనలో పాల్గొనని వారి కోసం రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ రీ సర్వే వ్యవహారం ఇప్పుడు ఎవరూ చర్చించడం లేదు. మోదీ కులం ఏమిటి.. రాహుల్ గాంధీ, కుల మతాలు ఏమిటి అన్నదానిపై మాత్రం విస్తృతంగా చర్చిస్తున్నారు.
ఓ సమావేశంలో మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చేసిన ఆరోపణలు హైలెట్ అయ్యాయి. దీంతో బీజేపీ నేతలు ఇక తమకు ఏ పని లేదన్నట్లుగా రాహుల్ కులమతాల గురించి చర్చించడం ప్రారంభించారు. రాహుల్ మతం, కులం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ ముస్లిం అని బండి సంజయ్ అంటారు. రాహుల్ గాంధీ కన్వెర్టెడ్ గాంధీ అని మరో నేత అంటారు. ఇలా రాహుల్ కుల మతాలను హాట్ టాపిక్ చేసి మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వీరికి కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ లోని కొంత మంది నేతలు దేశవ్యాప్తంగా కులగణన చేసి.. ఆ ఫాంతో రాహుల్ ఇంటికి వెళ్తే చెబుతారని బీజేపీ నేతలకు సలహాలిచ్చారు. అయితే జగ్గారెడ్డి మాత్రం రాహుల్ గాంధీ బ్రహ్మిణ్, హిందూ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇలా వీరి మధ్య జరుగుతున్న చర్చలు ఇతర అంశాలను హైలెట్ కాకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అసహనానికి గురవుతోంది. రెండు పార్టీలు డ్రామాలుడున్నాయని.. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అయితే ఏంటని కవిత ప్రశ్నిస్తున్నారు.