తెలంగాణ కులగణన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ జనాభాలో 46.25 శాతం మంది అంటే కోటి అరవై నాలుగు లక్షల మంది బీసీ వర్గాలకు చెందిన వారు వారు. వారి తర్వాత ఓసీ వర్గాలకు చెందిన వారు పద్దెనిమిది శాతానికి కాస్త ఎక్కువగా ఉన్నారు. అయితే వీరిలో ఓసీ ముస్లింలు రెండున్నర శాతం వరకూ ఉన్నారు. వీరిని తీస్తే హిందూ ఓసీలు కేవలం 15.79 శాతం మాత్రమే ఉన్నారు.
అదే సమయంలో ఎస్సీ వర్గానికి చెందిన వారి సంఖ్య 17.43 శాతం ఉంది. ఎస్సీల జనాభాను 61,84,319గా లెక్కించారు. ఎస్టీ వర్గాలకు చెందిన వారు 37,05,929 మంది ఉన్నారు. వీరి పర్సంటేజీ 10.45 శాతం. ముస్లింల సంఖ్య 44,57,012.. వీరి పర్సంటేజీ 1గరక2.56 శాతం. బీసీ ముస్లింలను విడిగా లెక్కించారు. వారి సంఖ్య 35,76,588 గా తేలింది. 10.08 జనాభాలో వీరి శాతం. మొత్తంగా 96.9 శాతం తెలంగాణలో ఉన్న సర్వే చేశామని.. 3,54,77,554 మంది వ్యక్తుల వివరాలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది . లక్ష ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని.. మరో లక్షా అరవై ఎనిమిది వేల కుటుంబాలు తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరించాయని ప్రభుత్వంతెలిపింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలనుకుంటోంది. ఈ కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టి ఆమోదించనున్నారు.