Switch to: English
తానా మహాసభల ప్రచారం సక్సెస్‌…

తానా మహాసభల ప్రచారం సక్సెస్‌…

వాషింగ్టన్‌డీసీలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న 22వ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఈ మహాసభల్లో అందరినీ భాగస్వాములను చేసేందుకు, అలాగే అందరినీప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను తానా కాన్ఫరెన్స్‌ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు, వివిధ రకాల పోటీలను నిర్వహించడం ద్వారా అమెరికాలోని తెలుగుకమ్యూనిటీని ఇందులో భాగస్వాములు అయ్యేలా చూస్తోంది. ధీంతానా, వాలీబాల్‌, క్రికెట్‌ వంటి ఆటల పోటీలను నిర్వహించడం ద్వారా ఎంతోమందిని కాన్ఫరెన్స్‌ నిర్వహణలో భాగస్వాములయ్యేలా చేస్తోంది. ధీంతానా (North American Telugu Community) పోటీల ద్వారా ఆటపాటల ప్రతిభను వెలికితీస్తోంది. తానా-క్యూరీ సంస్థతో కలిసి చిన్నారులకు నిర్వహిస్తున్న సైన్స్‌, మ్యాథ్స్‌, స్పెల్‌బీ పోటీలను నిర్వహించి వారి ప్రతిభకు పదునుపెడుతోంది.పాఠశాలతో కలిసి తెలుగు పోటీలను నిర్వహించి తెలుగు భాషలో వారి పటిమను వెలికితీస్తోంది. దీంతోపాటు పలు కార్యక్రమాలను కూడా అందరికీ ఉపయోగపడేలా కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేసింది. ప్రతి కాన్ఫరెన్స్‌ నిర్వహణకు ముందు తానా నాయకులు, కాన్ఫరెన్స్‌ నాయకులు వివిధ నగరాల్లో పర్యటించి కాన్ఫరెన్స్‌ నిర్వహణ వివరాలను, ఏర్పాట్లను కమ్యూనిటీకి తెలియజేయడం పరిపాటి. దాంతోపాటు కాన్ఫరెన్స్‌ నిర్వహణకుఅవసరమయ్యే నిధులను కూడా విరాళాలుగా సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయంలో భాగంగానే తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ నాయకులు నరేన్‌ కొడాలి, మూల్పూరి వెంకట్రావు, ఫండ్‌రైజింగ్‌ చైర్మన్‌ రవిమందలపు వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ నగరాల్లో ప్రచారాన్ని తానా కాన్ఫరెన్స్‌ నాయకత్వం చేపట్టింది. తానా పెద్దఎత్తున నిర్వహిస్తున్న 22వ మహాసభల (TANA Conference) నిర్వహణకోసం ఎంతోమంది తానా నాయకులు, సభ్యులు,  అభిమానులు, తెలుగు ప్రముఖులు తమవంతుగా విరాళాలను ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రకటించి తానాకుతమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పటికే వివిధ చోట్ల నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంతోమంది తమ విరాళాన్ని ప్రకటించి తానా మహాసభలను ఘనంగా నిర్వహించాల్సిందిగా నాయకత్వాన్ని ప్రోత్సహించారు. ఇప్పటికా తానాకాన్ఫరెన్స్‌ నాయకత్వం వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలను చేసింది. మరికొన్ని చోట్ల కూడా చేస్తోంది. దాదాపు అన్నీ నగరాల్లోని తెలుగు ప్రముఖులను, తానా నాయకులను, అభిమానులను స్వయంగా కలుసుకుని ఆహ్వానించాలనిఅధ్యక్షుడు సతీష్‌వేమన సారధ్యంలోని కాన్ఫరెన్స్‌ బృందం భావిస్తోంది. న్యూజెర్సి, అస్టిన్‌, హ్యూస్టన్‌, డల్లాస్‌, డిట్రాయిట్‌, కొలంబస్‌, మేరీలాండ్‌, ఫిలడెల్ఫియా ఇతర నగరాల్లో ఇప్పటికే కాన్ఫరెన్స్‌ నాయకత్వం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలను నిర్వహించింది (TANA conference website).…
అమెరికాలో తెలుగువారికి తానా ప్రోత్సాహం – ధీంతానా పోటీలతో అవకాశం

అమెరికాలో తెలుగువారికి తానా ప్రోత్సాహం – ధీంతానా పోటీలతో అవకాశం

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని కమ్యూనిటీనిమహాసభల్లో పాల్గొనే విధంగా ఎన్నో కార్యక్రమాలను, పోటీలను తానా నిర్వహిస్తోంది. అందులో ధీంతానా కూడా ఒకటి. మీపాట, మీ ఆట, మీ అందానికి గుర్తింపు ఇచ్చేలా ఈ పోటీలను ధీంతానా పేరుతో  నిర్వహిస్తోంది. సోలో సింగింగ్‌, గ్రూపుడ్యాన్సింగ్‌, కపుల్‌ డ్యాన్స్‌, మిస్‌ టీన్‌ తానా, మిస్‌ తానా, మిసెస్‌ తానా పేరుతో నిర్వహించే ఈ పోటీల్లో 5 సంవత్సరాల వయస్సు నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారంతా పాల్గొనవచ్చు. తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన ఆధ్వర్యంలో ధీంతానా కమిటీ చైర్‌ శ్రీమతి సాయిసుధ పాలడుగు పర్యవేక్షణలో దాదాపు 18 నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి రీజియన్‌లో జరిగే పోటీల్లో ప్రతి విభాగంలోనూ ఇద్దరిని విజేతగా ఎంపికచేస్తారు. ప్రాంతాలవారీగా గెలిచిన విజేతలందరూ తానా మహాసభల్లో (TANA conference) జరిగే ఫైనల్‌ పోటీలకు అర్హులవుతారు. ఫైనల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి పారితోషికంతోపాటు సెలబ్రిటీ నుంచి మీ బహుమతిని అందుకునేఅవకాశం లభిస్తుంది. సింగింగ్‌ పోటీలను శాస్త్రీయ-సినిమా-జానపద విభాగాలుగా వర్గీకరించి, సబ్‌ జూనియర్స్‌…