Switch to: English
అదానీ ఒప్పందాల్ని  రద్దు చేయనున్న చంద్రబాబు !

అదానీ ఒప్పందాల్ని రద్దు చేయనున్న చంద్రబాబు !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారం పడుతున్న అదాని విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేసే దిశగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మేరకు విద్యుత్ శాఖతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని పెట్టుబడులపై ప్రభావం పడకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వివాదం లేకుండా రద్దు చేసేందుకు అవసరమైన మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పెట్టుబడులపై ప్రభావం పడకుండా నిర్ణయాలు అదాని విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అంతర్జాతీయ వార్త అవుతుంది. ఎందుకంటే ఇది బయట పెట్టింది అమెరికా. పూర్తిగా భారత్ లో వ్యవహారానికి సంబంధించినది. అమెరికా బయట పెట్టిన విషయాలు నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి అంతర్గత విచారణ చేయకుండా పూర్తిగా ఆ దేశాన్ని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకునే చాన్స్ లేదు. అందుకే ప్రభుత్వం ఒప్పందాలను వడపోస్తోంది. వాటిని చేసుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయో ఆరా తీస్తోంది. ప్రజలపై భారం వేసే ఒప్పందాలు రద్దు మొత్తంగా ఇవాళ కాకపోతే ప్రజలపై పాతికేళ్ల పాటు భారం వేసే ఒప్పందాలను రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా రద్దు చేస్తే జగన్ రెడ్డికి అదానీకి ఇచ్చిన లంచం వెనక్కి ఇవ్వాల్సిందే. ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తోంది. అదానీకి ఎంత పలుకుబడి ఉన్నా.. ఆయనపై తీసుకునే చర్యలతో  ఏపీ ప్రభుత్వమే నిర్ణయాత్మకంగా మారనుంది. బీజేపీతో గతంలోలా సన్నిహిత సంబంధాలు లేని అదాని ? ప్రస్తుతం కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. అదాని విషయంలో కేంద్రం వ్యవహరించే విధానమే కీలకం. గత ఎన్నికలకు ముందు అదానీపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు. అదానీకి మీడియాసంస్థల్లో మోదీకి ప్రచారం ఆపేశారు. ఇప్పుడు ఇరువురి మధ్య అలాంటి బంధాలు లేకపోతే ఖచ్చితంగా కేంద్రం కూడా సంచలన నిర్ణయంతీసుకోవడం ఖాయమని అనుకోవచ్చు.
1 9 10 11 12 13 33