కల్యాణ్ రామ్ – వేణు మల్లిడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `తుగ్లక్` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా కేథరిన్ దాదాపుగా ఖాయమైంది. ఇటీవల కేథరిన్ పై లుక్ టెస్ట్ నిర్వహించారు. అది దాదాపు ఓకే అయినట్టే. `తుగ్లక్` ఓ పొలిటికల్ సెటైర్ అని, నేటి రాజకీయాల చుట్టూ ఈ సినిమా తిరగబోతోందని టాక్. ఫాంటసీ అంశాలూ ఉంటాయట. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. టైమ్ మిషన్‌లాంటి కాన్సెప్టుతో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని ప్రచారం జరుగుతోంది. 13వ శతాబ్దం కథా నేపథ్యంగా కనిపించనుందట. స్క్రిప్టు ఎప్పుడో పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.