జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుల విషయంలో సీబీఐకి కాస్త మొహమాటం ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై తన అభిప్రాయం చెప్పడానికి ఏ మాత్రం ఇష్టపడని సీబీఐ ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే పద్దతిని ఫాలో అవుతోంది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేయాల్సి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించి.. సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని అలాగే… న్యాయవ్యవస్థపైనా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. రఘురామరాజునే సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేశారు.
దీన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు… విజయసాయిరెడ్డితో పాటు సీబీఐకికూడా నోటీసులు జారీ చేసింది. కానీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం ఇద్దరికీ తీరలేదు. జగన్ పిటిషన్ విచారణ సమయంలో మూడు సార్లు వాయిదాలు కోరి.. చివరికి మూడు లైన్ల కౌంటర్ సీబీఐ దాఖలు చేసింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. వీలైనంత వరకూ విచారరణ ఆలస్యం చేయడమేనన్న అభిప్రాయం కూడా న్యాయవర్గాల్లో ఉంది. అయితే సీబీఐ ఖచ్చితంగా ఏదో ఓ అభిప్రాయం చెబితేఇంత రచ్చ ఉండేది కాదు.
సీఎం జగన్ విషయంలోనూ అంతే.. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ అదేపద్దతిలో వెళ్తోతందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం కాబట్టి… కొన్ని రకాల పరి మితుల వల్ల ఆయన పైసీబీఐ దూకుడుగా వెళ్లి ఉండకపోవచ్చు. కానీ విజయసాయిరెడ్డిపై మాత్రం.. అలాంటి రిజర్వేషన్లుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ సీబీఐ… ఎందుకనో కానీ ఆలోచిస్తోంది. ఫలితంగా విజయసాయిరెడ్డి మరికొన్నాళ్లుప్రశాంతంగాఊపిరిపీల్చుకునే అవకాశం ఉంది.