జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ… ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని సీబీఐ కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు నేడు నిర్ణయాన్ని ప్రకటించింది. తదుపరి చర్యగా.. ఈ పిటిషన్‌లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. తక్షణం ఆయన బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసుల విచారణలను వేగంగా పూర్తి చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్లో కోరారు.
మొదటగా ఆయన వేసిన పిటిషన్లో పూర్తి వివరాలు లేవని కోర్టు వెనక్కి పంపింది. ఆ తర్వాత పూర్తి వివరాలతో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు విచారణకు అర్హత ఉందో లేదో.. సీబీఐ కోర్టు వాదనలు విన్నది. ఈ రోజు నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీగా… తనకు బాధ్యత ఉందంటూ… సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు వాదించారు. తదుపరి .. సీఎం జగన్ తో పాటు… సీబీఐకి కూడా… సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
వైసీపీ తరపున ఎంపీగా గెలిచి.. ఆ పార్టీ అధినేతను ధిక్కరిస్తున్న రఘురామకృష్ణరాజుపై… వైసీపీ అనుసరిస్తున్న విధానంతో.. ఆయన మరింత పట్టుదలగా రాజకీయ పోరాటం చేస్తున్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయించిన తర్వాతనే తాను ఏపీకి వస్తానని చాలెంజ్ చేశారు. ఆ మేరకు పోరాటం చేస్తున్నారు. వైసీపీ వైపు నుంచి ఎన్ని బెదిరింపులు వస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.