వివేకానంద రెడ్డి హత్య కేసులో సైలెంట్‌గా ఉన్న సీబీఐ ఒక్క సారిగా ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎర్రగంగిరెడ్డి వివేగా హత్య కేసులో తొలిసారిగా అరెస్టయిన నిందితుడు. అయితే తర్వాత బెయిల్ వచ్చింది. దస్తగిరి అప్రవర్‌గా మారిన తర్వాత ఆయన పాత్ర ఖచ్చితం అయినందున బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారన్న కారణంగా ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టులో సానుకూల ఫలితం రాలేదు.
చాలా కాలం పాటు సైలెంట్‌గా సీబీఐ హఠాత్తుగా ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్యించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఈ కేసులో సీబీఐ చాలా ఒత్తిళ్లు ఎదుర్కోంటోంది. సీబీఐ అధికారులు కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొంత మంది సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయారు. ఈ తరుణంలో సీబీఐ విచారణ స్లో అవడంతో ఆ కేసు ఇక కంచికి పోయినట్లేనని అనుకుటంున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు పథకం రూపకల్పన జరిగిందని సీబీఐ చెబుతోంది. అందుకే ఈ కేసులో ఆయన ఏ వన్‌గా ఉన్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చిన తరవాత ఏ వన్ ఎవరో మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.