1992 డిసెంబర్ 6న ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై లఖ్నవ్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు …తీర్పు వెల్లడించనుంది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2009లో నివేదిక ఇచ్చింది. మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా బీజేపీ సీనియర్ నేతలు ఆద్వానీ, మురళీ మనోహర్జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలున్నారు. మసీదు కూల్చివేతకు నేర పూరిత కుట్ర పన్నారని అద్వానీతో పాటు పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదుఏసింది. 2001లో అద్వానీతో సహా ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
ఈ తీర్పును అలహాబాద్ కోర్టు సమర్థించింది. అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఓవర్రూల్ చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై నమోదైన నేరపూరిత కుట్ర అభియోగాలను రీస్టోర్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండేళ్లలో విచారణను పూర్తిచేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఆ గడువు ముగిశాక మరో నెలలు 9 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు కూడా గత నెలాఖరుకు ముగిసింది. అయితే మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. దీంతో సీబీఐ ప్రత్యేకకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. తుది తీర్పు సమయంలో.. నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలోనే ఆదేశించింది.
అయితే వయోభారం కారణం… కరోనా కారణంగా కోర్టు అనుమతిస్తే వాళ్లు ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు తీర్పు వింటారు. మసీదు కూల్చివేతపై నిందితులుగా పేర్కొన్న వారి వాదన మరోలా ఉంది. బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నేతలు అయోధ్య వెళ్లిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించామని అప్పుడు కొందరు ఆవేశంతో మసీదును కూల్చివేశారని వారు వాదిస్తున్నారు. నాయకులెవ్వరూ కరసేవకులను రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ఎవరి వాదన ఏమిటో.. బాబ్రీ కూల్చివేతకు కారకులు ఎవరో సీబీఐ కోర్టు తేల్చనుంది.