2024లో ఖచ్చితంగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ ప్రకటించడం రాజకీయవర్గాల్లో కాస్త సంచలనం రేపింది. ఎదుకంటే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఏదోఓ పార్టీలో చేరాల్సిందే. అందుకే ఆయన పోటీ చేస్తాను అని ప్రకటించగానే మీడియా ప్రతినిధులు.. ఏ పార్టీ అని అడిగేశారు.. అయితే ఈ విషయంలో ఆయన వద్ద కూడా సమాధానం లేదేమో కానీ.. వెంటనే ప్రజల పార్టీ అన్నారు. ఆయన దృష్టిలో ప్రజల పార్టీ ఏదీ అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఓ సారి పోటీ చేసి ఓటమి రుచి చూసి ఏదో ఓ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్్గా పోటీ చేసే సాహసం ఆయన చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.
రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలన్న లక్ష్యంతో ఐపీఎస్ పోస్ట్‌కు ముందస్తు రిటైర్మెంట్ ఇచ్చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణకు ఏది కలసి రాలేదు. కొత్త పార్టీ పెట్టాలా వద్దా అని ఊగిసలాడి… చివరి క్షణంలో జనసేన పార్టీలో చేరి విశాఖ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ఆయన వంటి మంచి వ్యక్తి ఓడిపోవడం… పెద్దపెద్ద నేరస్తులు గెలుపొందడంపై చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత వీవీ లక్ష్మినారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించడం ఇష్టం లేక వైదొలిగారు. పూర్తి స్థాయిలో తన స్వచ్చంద సంస్థ తరపున పని చేస్తున్నారు. కౌలురైతుగా కూడా మారారు.
జనసేనకు రాజీనామా చేసినా ఇటీవల కొన్ని విషయాల్లో ఆ పార్టీని అభినందిస్తున్నారు. ఈ కారణంగా మళ్లీ ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని వైసీపీ నేతలు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. అలా చేరితే జగన్ కేసుల్లో ఆయన దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని చెప్పొచ్చని వారి ఎత్తుగత. అయితే జేడీని విజయసాయిరెడ్డి వైసీపీలోకి కూడా ఆహ్వానించారు. ఓ సారి ట్విట్టర్లో చెలరేగిపోయిన విజయసాయిరెడ్డికి తనను వైసీపీలోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చెసి కౌంటర్ ఇచ్చారు వీవీ లక్ష్మినారాయణ. ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి ఎంతో కొంత ప్లస్ ఉంటుంది. ఆయన క్లీమ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కారడమే దీనికి కారణం .