ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు జారీ చేసింది. పదహారో తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. జైల్లోనే విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. కీలకమైన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ వేధింపులు ఆగవు అంటూ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారికి బెయిల్ లబించడం లేదు. మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైదరాబాద్ వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి.. తన భార్య ఆరోగ్యం బాగో లేనందున నాలుగు వారాల మధ్యంతర బెయిల్ కావాలని కోరడంతో కోర్టు అంగీకరించింది. ఇక ఎవరికీ బెయిల్ దక్కడం లేదు. ఇటీవల జైల్లో ఉన్న క్రిమినల్ సుకేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్లలో కేజ్రీవాల్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. కేజ్రీవాల్ చెప్పినట్లుగానే హైదరాబాద్‌లో కవితకు రూ. పదిహేను కోట్లు అందించినట్లుగా వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది.
ఇదే స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. తన పది ఫోన్లను ఈడీకి ఇచ్చారు. అయితే ఆమె తాను గాయపడినట్లుగా ప్రకటించారు. మూడు వారాల బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ప్రస్తుతం బయటకు రావడం లేదు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. సుకేష్ వాట్సాప్ టాప్ ఫేక్ అని ఆమె స్పష్టం చేశారు. మరో వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేయడంతో.. ఆమ్ఆద్మీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.