వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసుల్ని వాట్సాప్లో పంపారు. గత నెల 28న అవినాష్ రెడ్డిని తొలి సారిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన కాల్ లిస్ట్ తో ప్రశ్నలు వేయడంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లతో మాట్లాడినట్లుగా తేలింది. దీన్ని అవినాష్ రెడ్డి కూడా అంగీకిరంచడంతో వారిదర్నీ ప్రశ్నించారు సీబీఐ అధికారులు.
అయితే ఫోన్లు వారికే చిసనప్పటికీ మాట్లాడింది మాత్రం జగన్, భారతిలేనని సహంజగా ఎవరికైనా డౌట్ వస్తుంది. సీబీఐ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరైనప్పుడు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే ఇలాంటి వి వారు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అవినాష్ రెడ్డి అడిగిన పలు సౌకర్యాలు కూడా కల్పించడానికి నిరాకరించారు. మరోసారి పిలవకపోవచ్చని అవినాష్ రెడ్డి అప్పట్లో చెప్పారు.కానీ నెలలోపే మరోసారి పిలుస్తున్నారు.
ఈ కేసులో అన్ని వేళ్లూ ప్రధానంగా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నారు. అందుకే ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేయడం ఎప్పటికప్పుడు సంచలనం అవుతోంది. గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు సీఎం జగన్ మూడు రోజుల పాటు అన్ని పర్యటనలకు క్యాన్సిల్ చేసుకుని క్యాంప్ ఆఫీస్ కే పరిమితమయ్యారు. ఈ సారి జగన్ ఎలాంటి ప్రయత్నాలు అయినా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.