మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ పోలీసులు నజర్ పెట్టారు. ఆయనమార్ఫింగ్ వీడియో ప్రదర్శించారని కర్నూలులో కేసు పెట్టి.. అక్కడికే రావాలని అదే పనిగా నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట.. ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడలోని దేవినేని ఉమ ఇంటికి నోటీసులు అంటించి పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే తాను రాలేనని పదిరోజుల సమయం కావాలని కోరుతూ ఉమ లేఖ రాశారు. ఇప్పుడు… ఆ లేఖపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయని కర్నూలు సీఐడీ అధికారులు పందొమ్మిదో తేదీన రావాల్సిందేనని స్పష్టం చేస్తూ మరోసారి ఇంటికి నోటీసులు అంటించారు.
దేవినేని ఉమప్రదర్శించిన వీడియో మార్ఫింగ్ చేసిందని..కర్నూలుకు చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు ఏకంగా ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. దీంతో అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతోనే… కనీసం నాలుగైదులు జైల్లో ఉంచి.. ఆనందం పొందాలన్న టార్గెట్‌తోనే ఈ కేసులు పెట్టారని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే దేవినేని ఉమఈ కేసులపైన్యాయ సలహా తీసుకుంటున్నారు. విచారణకు హాజరవ్వాలని అనుకుంటున్న ఆయన… ఈ మేరకు టీడీపీకి చెందిన న్యాయవిభాగంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
వైసీపీ హిట్‌లిస్ట్‌లో దేవినేని ఉమ పేరు ఫస్ట్ డౌన్లోనే ఉంటుంది. ఆయనను స్పెషల్ గా టార్గెట్ చేసినట్లుగా గతంలోనే వెల్లడయింది. సీఎం జగన్‌ను దూకుడుగా విమర్శించే దేవినేని ఉమను కొద్ది రోజులు అయినా జైల్లో పెట్టాలన్న టార్గెట్‌తో ఉన్నారని అందుకే.. ఏ కేసులు దొరక్క.. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు..మార్ఫింగ్ అంటూ.. కర్నూలులో ఫిర్యాదు చేయించారని అంటున్నారు. దేవినేనిఉమ ప్రదర్శించిన వీడియో… సాక్షి టీవీలోనూ ప్రసారమయింది. అయితే.. దాన్ని కోర్టులో నిరూపించొచ్చు కానీ.. అప్పటికే దేవినేని ఉమను కొన్నాళ్లు జైల్లో పెట్టగలరని అంటున్నారు. ఈ అవకాశం ఇవ్వకూడదని టీడీపీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.