నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అక్రమాలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి ఆటంకం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయన తన భార్య, కుమార్తె పేరుతో కంపెనీలు పెట్టి.. బ్యాంకుల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని కేసులు నమోదయ్యాయి. బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. రుణాలు చెల్లించని కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలని ఆర్బీఐ గతంలో సర్క్యూలర్ జారీ చేసింది. ఆ మేరకు… రఘురామకృష్ణరాజు కంపెనీల ఖాతాలను కూడా ఆయా బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా బ్యాంకులు ఆ విధంగా చేశాయని… నిలుపుదల చేయాలని కోరారు.
అప్పుడు ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అయితే.. ఆ తీర్పు తదుపరి చర్యలు తీసుకోవడానికి అడ్డం కాదని తాజాగా హైకోర్టు సీబీఐ విచారణ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని తాజాగా స్పష్టత ఇచ్చింది. బ్యాంకులకు రఘురామకృష్ణరాజు కొన్ని వేల కోట్ల బాకీ ఉన్నారు. ఆయనపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. కారణం ఏమిటో కానీ ఎంపీగా ఎన్నిక కాక ముందు ఆయన ఇళ్లల్లో సోదాలు చేశారు కానీ.. తర్వాత పట్టించుకోవడం మానేశారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగానే సీబీఐ ఆగిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు… హైకోర్టు సీబీఐ విచారణకు .. తన ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది.
ఇటీవల సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా… ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. హైకోర్టు నుంచి ఇలాంటి రూలింగ్ వచ్చిన రోజునే ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. ఈ కారణంగా ఆయన మరీ టెన్షన్ పడటం లేదంటున్నారు.