వివేకా కేసులో నిందితులకు త్వరలో మరోసారి సినిమా కనిపిస్తుందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వం తాజాగా వేసిన అఫిడవిట్ ప్రకారం అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేస్తున్నారు. గతంలో వారే హత్య చేసి తమను ఇరికించే కుట్ర చేశారని ఆరోపించారు.
ఆదినారాయణరెడ్డితో పాటు బీటెక్ రవిలను ఇరికించే కుట్ర చేశారని అప్పటి సీఎం జగన్ పై వీరిద్దరూ మండిపడుతూ ఉంటారు. వివేకానందరెడ్డిని దారుణంగా చంపేసిన గుండెపోటు అని ప్రచారం చేశారు.. చివరికి బయటకు తెలిసే సరికి మొదట చంద్రబాబు అని తర్వాత ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పనేనన్నారు. ఎవరూ నమ్మకపోవడంతో వివేకా కుమార్తె, అల్లుడిపైనా ప్రచారం చేశారు. ఘోరంగా వారికి లేనిపోని బంధాలు అంటగట్టారు. చివరికి వారే దొరికిపోయే పరిస్థితి వచ్చింది.
ఆ హత్య లో పాల్గొన్న వారిలో దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ అయ్యారు. మరో నిందితుడు సునీల్ యాదవ్ .. హత్య అనే సినిమాలోతన తల్లిని తప్పుగా చూపించారని .. ఇది వైసీపీ నేతల పనేనని వారిపై మండి పడుతున్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని.. తాను కోట్లు సంపాదించానని రాచమల్లు ప్రసాదరెడ్డి వంటి వారు అంటున్నారని అవెక్కడ ఉన్నాయో చూపించాలని అంటున్నారు. ఇటీవలి కాలంలో న్యాయస్థానాల్లో వివేకా కేసు కదలకపోయినా..బయట మాత్రం వ్యవహారాలు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలోనే కేసు దశ..దిశ తేలే అవకాశం ఉంది.