నిరవ్, చోక్సీల కంటే రాయపాటి స్కామే పెద్దది..!

బ్యాంకులను నిట్ట నిలువుగా ముంచేసి… వందలు వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి జాబితాలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి దాదాపుగా రూ. ఏడువేల కోట్లకు రుణాలు తీసుకుని చెల్లించడం మానేశాయి. ఆ రుణాలను దారి మళ్లించేశారు . ఈ విషయాన్ని శుక్రవారం అంతా..రాయపాటి ఇళ్లల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు.. అనేక పత్రాలను స్వాధీనం చేసుకుని ఢిల్లీలో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో… రాయపాటి చేసిన స్కాం నిరవ్ మోడీ, మోహుల్ చోక్సీలు చేసిన దాని కన్నా పెద్దదని తేల్చారు.

రాయపాటి కుటుంబానికి ట్రాన్స్‌ట్రాయ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకే మొదట కాంగ్రెస్ హయాంలో పోలవరం కాంట్రాక్ట్ దక్కింది. ఈ సంస్థ చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, అదనపు డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీశ్‌ కెనరా బ్యాంకు సారథ్యంలోని కన్సార్టియంను దాదాపు రూ.7,926.01 కోట్లు రుణం తీసుకున్నారు కానీ చెల్లించలేదు. కెనరా బ్యాంకు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసుల నమోదు, సోదాలు చేసింది. నకిలీ ఖాతాలు సృష్టించడం, తప్పుడు స్టాక్‌ స్టేట్‌మెంట్లు, బ్యాలెన్స్‌ షీట్ల తారుమారు, నిధులను వివిధ మార్గాల్లో మళ్లించడం వంట నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది.

రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు చేయడం ఇదే మొదటి సారి కాదు. గత జనవరిలోనూ సోదాలు చేశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనిరుణాలు ఎగ్గొట్టారని సీబీఐ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏడాది ముగుస్తున్న సమయంలో మరోసారి సోదాలు చేసి… నిరవ్ మోడీకన్నా పెద్ద స్కాం చేశారని ప్రకటించారు. మరి తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో మాత్రం స్పష్టత లేదు. అరెస్టులు చేసి.. ఆస్తులను స్వాధీనం చేసుకుని… బ్యాంకుల సొమ్ములను బ్యాంకులకు ఇస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎప్పుడూసోదాలు చేయడం.. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెప్పడంతోనే సరిపోతోంది. పారిపోయేవాళ్లు పారిపోతున్నారు. వారిని పట్టుకుని రాలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close