వైఎస్ వివేకా హత్య కేసుని సీబీఐ పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. సీఎం జగన్ రెడ్డి పేరును చార్జిషీట్లలో ప్రస్తావించిన తర్వతా ఇక ముందుకు అడుగు వేయవద్దని ఎవరో ఆదేశించినట్లుగా కామ్ అయిపోయింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కూడా సీబీఐ సిద్ధపడలేదు. సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసింది. అంటే అప్పటి వరకూ అవినాష్ రెడ్డికి ఇబ్బందేం లేదు. తల్లిని అడ్డం పెట్టుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి అధికార బలానికి తిరుగులేదని నిరూపించుకున్నారు.
మరో వైపు సీబీఐ కనీసం దర్యాప్తు గడువు పొడిగించాలని కూడా కోరలేదు. అంటే ఇక విచారరణ కొనసాగించే ఉద్దేశం లేదన్నమాట. వేసిన చార్జిషీట్లతో సరి పెడతారని స్పష్టమవుతోంది. తదుపరి విచారణ సెప్టెంబర్ కు వాయిదా వేయడంో… సీబీఐ ఈ కేసులో తదుపరి విచారణ చేసేదమీ లేదు. గతంలో సుప్రీంకోర్టు జూన్ 30 వ తేదీలోపు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆ గడువు పూర్తయినా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అయినా దర్యప్తు కొనసాగించాలని సమయం కోరేందుకు నిరాసక్తంగా ఉంది.
గంగిరెడ్డి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సునీత.. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశమని వ్యాఖ్యానించారు. కేసు వివరాలన్నింటినీ సీల్డ్ కవర్ లో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. లాయర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. గంగిరెడ్డి తరపు లాయర్లుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ తోపాటు పరిశీలిస్తామని స్పష్టం చేసింది.