వివేకా కేసులో సీబీఐ అనూహ్యంగా గట్టిగా నిలబడుతోంది. తమపైనే కేసులు పెట్టి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని నిందితుల బలం కన్నా… తామే శక్తిమంతులం అని నిరూపించుకోవాలన్న పట్టుదల సీబీఐలో కనిపిస్తున్నట్లుగా ఉంది. నిందితుల బెయిళ్ల రద్దు విషయంలో సవాల్ చేసేందుకు తమకు పరిమితిలు ఉన్నాయేమో కానీ.. సునీత దాఖలు చేసే పిటిషన్ల విషయంలో .., ఆమె తరపున గట్టిగా నిలబడటానికి సంకోచించడం లేదు.
వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందేనని సునీత దాఖలుచేసిన పిటిషన్ పై.. సీబీఐ దాఖలుచేసిన కౌంటర్ చూస్తే న్యాయనిపుణులకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. బెయిర్ రద్దు చేయకుండా ఉండటానికి ఒక్క కారణం కూడా అవినాష్ రెడ్డి వద్ద లేదు. అంత గట్టిగా సీబీఐ కౌంటర్ వేసింది. తాజాగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి… మరో నిందితుడి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పటికే అసలు వివేకా హత్యకేసును ఎగ్జిక్యూట్ చేసినట్లుగా సీబీఐ చెబుతున్న శివశంకర్ రెడ్డి బెయిల్ పై వచ్చారు.
ఆయన హైదరాబాద్ నుంచే పులివెందుల.. కడప లోక్ సభలో వైసీపీ తరపున ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత న్యాయపోరాటం అలుపెరగకుండా చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చెడ్డపేరు తెచ్చుకున్న సీబీఐ…. కోర్టుల్లో మాత్రం.. తన వాదనలో కాస్తయినా నిజాయితీ ఉండేలా చూసుకుంటోందన్నఅభిప్రాయం వినిపిస్తోంది.