సీబీఐ అధికారులు మళ్లీ విచారణకు రావాలని పిలువలేదని చెప్పుకున్న అవినాష్ రెడ్డికి సీబీఐ.. మరోసారి పిలుపునిచ్చింది. ఈ సారి ఎక్కువ రోజులు సమయం ఇవ్వలేదు. ఒక్క రోజే గడువు ఇచ్చింది. సోమవారం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. పులివెందులలోని ఆయన నివాసంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే తాను చాలా బిజీ అని .. సోమవారం రాలేనని అవినాష్ రెడ్డి అప్పుడే చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వైఎస్ వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చివరికి చేరుకుందని చెబుతున్నారు. విచారణకు వెళ్లిన ప్రతీ సారి సీబీఐ మీద ఆరోపణలు చేయడం…. తాము చెప్పినట్లుగా విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడం కామన్ గా మారింది. ఇటీవల కడప సెంట్రల్ జైలులోనే సీబీఐ అధికారుల బృందం కొంత మందిని విచారించించింది. సీఎం జగన్ సతీమణి పీఏ నవీన్ ను మరోసారి విచారణకు పిలుస్తామని ఆయన తరపు లాయర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి సీబీఐ పిలుపు సంచలనంగా మారింది
అవినాష్ రెడ్డి తండ్రికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన మాత్రం కడపలోనే విచారణకు హారు కానున్నారు. సునీల్ యావద్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం చూస్తే… అవినాష్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా సీబీఐ గుర్తించినట్లుగా భావించవచ్చు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు బలంగానే వినిపిస్తున్నాయి.