గుంటూరు అర్బన్ ఎస్పీపై పీహెచ్డీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇటీవలి కాలంలో పోలీసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోపణల్లో.. అత్యధికం… కొంత మందిని.. తీసుకెళ్లిపోయి… హింసిస్తున్నారనేదే. ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.. అధికార పార్టీ నేతల ఫిర్యాదుల మేరకు.. కొంత మందిని టార్గెట్ చేసి మరీ.. తీసుకెళ్తున్నారని.. వివాదం అయిన తర్వాత అరెస్ట్ చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కేసులోనే… అర్బన్ ఎస్పీ తీరుపై.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కొద్ది రోజుల కిందట… గుంటూరులో ముగ్గురు యువకుల అదృశ్యమయ్యారు. వారిని పోలీసులే తీసుకెళ్లారు. వాళ్లంతా ఇంట్లో ఉన్నప్పుడే మఫ్టీలో ఉన్న పోలీసులు దాడి చేసి తీసుకెళ్లారు. కానీ అరెస్ట్ చూపించలేదు.
15 రోజులైనా పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కుటుంబస్బయులు. ఆ తర్వాత పోలీసులు వారిపై.. క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్నారని కేసులు నమోదు చేశారు. ముగ్గురు యువకుల్ని చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్ర హింసలు పెడుతున్నారని కోర్టు దృష్టి తీసుకెళ్లడంతో … బైరోప్చు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణ నివేదిక.. జ్యూడియల్ నివేదిక కూడా తేడాగా ఉండటంతో… నిజాలను రాబట్టేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. న్యాయవిచారణకు పోలీసులు సరిగా స్పందించకపోవడంతో సీబీఐ ఆదేశించిది.
కొద్ది రోజుల క్రితం.. డీజీపీ సవాంగ్ కూడా.. హైకోర్టు ఎదుట హాజరయ్యారు. అది కూడా.. ఈ తరహా కేసే. ఓ టీడీపీ మాజీ మంత్రి మనవడ్ని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు. వారు కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడం.. పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని.. జ్యూడిషియన్ విచారణలో తేలడంతో.. డీజీపీని కోర్టుకు పిలిపించింది హైకోర్టు. అయినప్పటికీ.. అలాంటి కేసులోనే.. మరోసారి పోలీసులు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. సీబీఐ విచారణతో.. ఏపీ పోలీసు వర్గాల్లో అలజడి ప్రారంభమయింది.