దేశంలో ఇప్పుడోరకమైన ఉద్రిక్త పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీని ఎవరు గట్టిగా వ్యతిరేకించిన వారి ఇంటి ముందు తెల్లవారే సరికల్లా.. ఐటీ, ఈడీ, సీబీఐ అధికారులు రెడీగా ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు.. సోదాలు చేస్తారు. దొరికినవి పట్టుకెళ్తారు. దొరకపోతే… మీడియాతో ఏదో ఓ మసాలా అందించి… చోద్యం చూస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను జైలుకు పంపడం దగ్గర్నుంచి… అనేక మంది రాజకీయ నాయకులు నోరెత్తకుండా చేయడం వరకూ.. ఈ సీబీఐనే.. బీజేపీకి అసలైన.. నిఖార్సైన మిత్రపక్షంగా మారిపోయింది.
బీజేపీని వ్యతిరేకిస్తే వదిలి పెట్టరా..?
స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ.. సీబీఐని ఇంతగా దుర్వినియోగం చేసిన వారు ఎవ్వరూ లేరు. రాజకీయ ప్రత్యర్థుల వేట కోసం తెచ్చిన అధికారులే.. అవినీతి ఆరోపణలతో దొరికిపోయి పదవులు కోల్పోయిన దౌర్భాగ్య వ్యవస్థ సీబీఐలో ఏర్పడిన తర్వాత… ఎవరైనా సీబీఐని ఎలా నమ్ముతారు. కేవలం.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి మీదే.. పదే పదే దాడులు జరుగుతూంటే.. వారు లొంగిపోతే… సీబీఐ దర్యాప్తు నెమ్మదిస్తూంటే.. సీబీఐ నిజాయితీగా పని చేస్తుందని ఎవరు నమ్ముతారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా.. అధికారపక్షంపై సీబీఐ దాడి జరిగిందా..? యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకోగానే… ఎప్పుడో పదిహేనేళ్లు, పదేళ్లకిందట.. జరిగినవి అంటూ.. పాత కేసుల ఫైళ్లు తీసి.. వాళ్లపై.. వందల మంది అధికారులతో.. దాడులు చేయించేస్తారా..?. రాజకీయంగా కొరుకుడు పడని విధంగా ఉన్నారని..మమతా బెనర్జీ.. ని.. బెంగాల్లో… విచ్చలవిడి సీబీఐ వ్యవహారాలతో.. మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నారా..? కర్ణాట, తమిళనాడుల్లో సీబీఐ దాడులో మోడీ సాధించిన రాజకీయ లాభం ఎవరికి తెలియదు. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతల్ని సీబీఐ కేసుల పేరుతో కుక్కిన పేనుల్లా పడి ఉండేలా చేయలేదా..?
హవ్వ.. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో ఈ వేగం ఏమయింది..?
భారతీయ జనతా పార్టీకి దగ్గరయితే చాలు.. ఎంత గజదొంగలైనా… నిర్భయంగా బయట తిరగవచ్చు. దానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి, కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి దగ్గర్నుంచి గుజరాత్లో… ఎంతో మందగి మోస్ట్ వాంటెడ్.. సీబీఐ కేసులు ఉన్న వాళ్ల వరకూ.. సులువుగా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. దేశాల మధ్య సులువుగా పయనించేస్తూ ఉంటారు. ఇప్పటికీ.. సీబీఐ దగ్గర కొన్ని వందలు, వేల కేసులు విచారణలో పెండింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ నేత.. అప్పనంగా ప్రజాధనాన్ని దోచుకున్నట్లు స్పష్టమైన ఆధారాలతో.. చార్జిషీట్లు వేస్తే.. ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడనీయలేదు సీబీఐ. ఐరన్ ఓర్ గనుల్ని ఇష్టం వచ్చినట్లు తవ్వేసి.. జాతీయ సంపదను చైనాకు అమ్మేసిన.. గాలి జనార్ధన్ రెడ్డి వేల కోట్లు సంపాదిస్తే.. ఇప్పుడా కేసుల్ని కొట్టి వేయడానికి అనుకూలమైన పరిస్థితులు తెచ్చి పెట్టారు. బీజేపీకి దగ్గరగా ఉంటే.. చాలా.. సీబీఐ వారి జోలికి వెళ్లదు. బీజేపీకి వ్యతిరేకిస్తే చాలు.. పదేళ్లు, పదిహేనేళ్ల కిందట కేసుల్ని కూడా బయటకు తీస్తారు.
బీజేపీ నేతలు అంత సుద్దపూసలా..?
సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ… అధికార దుర్వినియోగం చేస్తూ.. విపక్ష నేతలను హాహాకారాలు చేస్తున్నారని చెప్పుకుని ఆనందం పొందడం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నైజం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కరూ తప్పు చేయడం లేదా..?. ఏ ఒక్కరిపైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ అమిత్ షా కొడుకే.. అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. కానీ.. కిక్కురుమనలేదే. మహారాష్ట్రాల్లో… చివరికి చిన్న పిల్లలకు పంచే చిక్కీలను కూడా తిన్నారని చెప్పుకున్నారు. గుజరాత్లో.. పల్లీల స్కాం జరిగింది.. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములకు కొదవే లేదు. ఎందుకు.. ఒక్కటంటే.. ఒక్క రాష్ట్రంలో… సీబీఐ దర్యాప్తు జరగదు.
అధికారం శాశ్వతం కాదు… కానీ… ఒక్క సారి అది చేతికందితే.. తమకు శాశ్వతం అని అనుకుని.. చెలరేగిపోతే.. పతనం.. అప్పట్నుంచే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం.. కేంద్రం తీరును చూస్తూంటే.. అదే కనిపిస్తోంది.