జగన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు పక్కన పెట్టిన బ్యూటిఫికేషన్ గడ్డిని తగులబెట్టిన వ్యవహారంలో సాక్ష్యాలు .. సీన్ ఫుటేజీ ఇవ్వడానికి తాడేపల్లి ప్యాలెస్ సిబ్బంది నిరాకరిస్తున్నారు. తమపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్న వారు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నది పోలీసులకు మిస్టరీగా మారింది. ఇందులో ఏదో గూడుపుఠాణి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు జగన్ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఎనిమిది కెమెరాలు ఏర్పాటు చేశారు.
జగన్ రెడ్డి, వైసీపీ రాజకీయం అంతా.. పాత కాలం కుట్రల కోణంలోనే ఉంటాయి. తమపై తామే దాడి చేసుకుని రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ సారి అలాంటి వాటికి చెక్ పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమపై కుట్రలు చేశారని అంటారు కానీ సాక్ష్యాలు మాయం చేస్తారు.. దర్యాప్తునకు సహకరించరు.. కనీసం కోర్టుకు కూడా హాజరు కారు. కోడి కత్తి కేసు నుంచి గులకరాయి కేసు వరకూ జరిగింది అదే.
ఇలాంటి రాజకీయాలకు చెక్ పెట్టడానికి అయినా తాడేపల్లి ప్యాలెస్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించుకుని ఉంటారని చెబుతున్నారు. మొత్తంగా జగన్ .. తన ఇంటి ముందు తగలబడిన గడ్డి విషయంలో పోలీసులకు సాక్ష్యాలు ఇవ్వడానికి నిరాకరించి ఇప్పుడు తన ఇంటిపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టేలా చేసుకున్నారు. ఇక జగన్ తాడేపల్లికి వస్తారా.. బెంగళూరు నుంచే పార్టీని నడుపుతారా ?