గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా సజావుగా సాగుతోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చాల మంది ప్రముఖులు వచ్చి సామాన్య ప్రజలతో పాటు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఆ తరువాత వారిలో చాలా మంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని తమ ట్వీటర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేసారు. సినీ రంగానికి సంబంధించి వారిలో ఇంత వరకు బాలకృష్ణ, అల్లు అర్జున్, జగపతిబాబు, నాగార్జున కుటుంబ సభ్యులు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. రాజకీయ పార్టీలలో తెదేపా కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు, తెరాస మంత్రి కె.టి.ఆర్. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. “మేము ఓటు వేశాము. మీరు కూడా వేయండి” అని అందరూ సోషల్ మీడియా ద్వారా గ్రేటర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
“మా వదినమ్మ భువనేశ్వరి తెరాసకే ఓటు వేస్తుందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న బహిరంగ సభలో చెప్పారు. కానీ ఆమె దానిని వెంటనే ఖండించారు. ఆమె ఎవరికి ఓటు వేస్తారో కేసీఆర్ కి తెలియదనుకోలేము. కానీ ఆరోజు అలాగా చెప్పేశారు. వదినమ్మ ఎవరికి ఓటేసారో కేసీఆర్ కి తెలియకపోయినా ప్రజలందరికీ మాత్రం ఖచ్చితంగా తెలుసు.